జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

దేవుడు నిజమేనా?

దేవుని నమ్ముట కొరకు విజ్ఞానం అనేక ఉదాహరణలు ఇస్తుంది. DNA ఎందుకు ప్రాముఖ్యమైనది?

బ్రిటిష్ తత్వవేత్త, Dr. Antony Flew, నాస్తికత్వమునకు ప్రతినిధిగా ఉండి, దానిని సమర్థిస్తూ అనేక వాదనలు చేశాడు. అయితే, గత 30 సంవత్సరాలలో జరిగిన వైజ్ఞానిక ఆవిష్కరణలు ఆయన తప్పించుకోలేని కొన్ని విషయాలను ఒప్పుకునేటట్లు చేశాయి. డిసెంబర్ 2004లో జరిగిన ఒక విడియో ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నాడు, “జీవము యొక్క ఆరంభమునకు మరియు ప్రకృతి యొక్క క్లిష్టతకు గొప్ప-జ్ఞానము మాత్రమే ఉత్తమ వివరణ.” ఆయన తీర్పులో ప్రాముఖ్యమైనది DNA. దానికి కారణం ఇది.

మన కణాలలో ఉన్న DNA ఒక కంప్యూటర్ ప్రోగ్రాంను పోలియుంటుంది.

ఒక కంప్యూటర్ ప్రోగ్రాం సున్నాలు మరియు ఒకటిల క్రమంలో చేయబడుతుందని (దీనినే బైనరీ కోడ్ అంటారు) మీ ఎడమ వైపు ఉన్న చిత్రంలో మీరు చూడవచ్చు. ఈ ఒకటి మరియు సున్నాల క్రమము మరియు వరుస కంప్యూటర్ ప్రోగ్రాం సక్రమంగా పని చేయుటలో సహాయపడుతుంది.

కంప్యూటర్ ప్రోగ్రామింగ్:
DNA కోడ్:

అదే విధంగా, DNA అనునది A, T, G, మరియు C అని అక్షరములతో పిలువబడు నాలుగు రసాయనాలతో చేయబడినది. ఒకటి మరియు సున్నాల వలె, మానవ కణంలో ఈ అక్షరాలు ఈ విధంగా అమర్చబడినవి: CGTGTGACTCGCTCCTGAT మొదలగునవి. అవి అమర్చబడిన విధానం కణముల యొక్క క్రియలను హెచ్చరిస్తుంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీ శరీరంలో ఉన్న ప్రతి చిన్న కణములో, ఈ కోడ్ మూడు బిలియన్ల పొడవు కలిగియుంటుంది!!2

ఒక కణంలో ఉన్న DNA పరిమాణమును అర్థం చేసుకొనుటకు, “క్షణానికి మూడు పదముల వేగంతో రాత్రి పగలు నిర్విరామంగా చదివినా ఆ కోడ్ మొత్తమును చదువుటకు ముప్పై-ఒక్క సంవత్సరం పడుతుంది.”3 అంతే కాదు, ఇంకా ఉంది.

మీ DNAలోని 99.9% ఇతరుల జెనిటిక్స్ కు పోలినదిగా ఉంటుందని నిర్థారించబడినది.4 మీ కణంలో ఈ మూడు బిలియన్ల అక్షరాలు ఏ క్రమములో అమర్చబడ్డాయి అనునది మీకు విశేషమైనది.

తొమ్మిది అంకెలు గల సోషల్ సెక్యూరిటీ నెంబర్ ద్వారా అమెరికా ప్రభుత్వం దేశంలో ప్రతి ఒక్కరిని గుర్తించగలుగుతుంది. అయినను, మీలో ఉన్న ప్రతి కణంలోను కేవలం మీకు మాత్రమే చెందిన మూడు బిలియన్ల అక్షరాలు కలిగిన నిర్మాణం ఉంది. ఈ కోడ్ మిమ్మును గుర్తించి మీ కణముల యొక్క స్వభావమును తెలియజేస్తుంది.

DNA ఎందుకు ముఖ్యమైనదో మీరు చూడవచ్చు.

హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ (మానవ DNA నిర్మాణమును చిత్రించినవాడు) యొక్క డైరెక్టర్ అయిన Dr. Francis Collins అన్నాడు కదా, “DNAను కణము యొక్క కేంద్రకములో కూర్చొనియున్న హెచ్చరిక పత్రముగాను, సాఫ్ట్వేర్ ప్రోగ్రాంగాను ఆలోచించవచ్చు.”5

సమాచార నిపుణుడైన Perry Marshall దీని పరిణామాలను గూర్చి వ్యాఖ్యానించాడు. "ఎవరు రూపించని కంప్యూటర్ ప్రోగ్రాం ఎన్నడు ఉనికిలో లేదు...అది కోడ్ కావచ్చు, లేక ఒక ప్రోగ్రాం, లేక ఒక భాష ద్వారా ఇవ్వబడిన సందేశం కావచ్చు, దాని వెనుక ఎల్లప్పుడూ ఒక తెలివైన మెదడు ఉంది.” 6

Just as పూర్వ నాస్తికుడైన Dr. Antony Flew ప్రశ్నించినట్లు, కణమునకు హెచ్చరించు ఈ మూడు బిలియన్ల కోడ్ గురించి తమను తాము ఈ ప్రశ్నలు అడుగుట సమంజసమే . . . ఈ పత్రమును ఎవరు వ్రాశారు? కణము లోపల ఈ కార్యశీల కోడ్ ను ఎవరు ఉంచారు?

ఇది మీరు సముద్రపు ఒడ్డున నడుస్తూ, అక్కడ ఉన్న ఇసుక మీద “మైక్ లవ్స్ మిషెల్” అని చూసిన దానితో సమానంగా ఉంది. సముద్రపు ఒడ్డున వస్తున్న అలలు దానిని వ్రాయలేదని మీకు తెలుసు--ఒక వ్యక్తి దానిని వ్రాశాడు. అది ఒక స్పష్టమైన సందేశం. దానిలో ఒక స్పష్టమైన మాట ఉంది. అదే విధంగా, DNA వ్యవస్థ క్లిష్టమైనదై మూడు-బిలియన్ల అక్షరాలు కలిగినది, మరియు ఇది కణం యొక్క ప్రక్రియను తెలిపి దానికి దిశను చూపుతుంది.

మన కణాలలో నివాసముంటున్న ఈ క్లిష్టమైన సందేశం మరియు కోడ్ ను ఒకరు ఎలా వివరించగలరు?

జూన్ 26, 2000 సంవత్సరమున అధ్యక్షుడైన Clinton మానవ జీనోమ్ వరుసను పూర్తిచేసిన వారికి అభినందనలు తెలిపారు. “నేడు దేవుడు జీవమును సృష్టించిన భాషను మనం నేర్చుకొనుచున్నాము. దేవుని యొక్క అత్యంత దైవిక, పవిత్రమైన బహుమతి యొక్క క్లిష్టత, సౌందర్యము, మరియు అద్భుతమును గూర్చి మరింత ఆశ్చర్యపోవుచున్నాము.”7 హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ అయిన Dr. Francis Collins, Clinton తరువాత వేదికపైకి వచ్చి ఇలా అన్నాడు, “ఇంతకు ముందు దేవునికి మాత్రమే తెలిసిన మన సొంత హెచ్చరిక పుస్తకము యొక్క మొదటి సమాచారం పొందియున్నాము అను ఆలోచన నన్ను మరింత విధేయునిగాను ఆశ్చర్యపడులాగును చేస్తుంది.” 8

మానవ శరీరంలోని DNA వ్యవస్థను చూడగా, ఒక జ్ఞానవంతమైన (గొప్ప వివేకవంతమైన) రూపును చూడకుండా మనం తప్పించుకొనలేము.

బైబిల్ ప్రకారం (దానిలో అదే గొప్ప క్లిష్టత కలిగినది) దేవుడు మన ఉనికికి కర్త మాత్రమే కాదు, కాని మన ఉనికిని అర్థవంతుముగా చేయు అనుబంధం ఆయన. జీవితంలో మనం వెదకు ప్రతిది...ప్రతి పరిస్థితికి కావలసిన శక్తి, ఆనందం, వివేకం, మరియు మనం ప్రేమ పొందుచున్నామని తెలుసుకొనుట...ఆయన మాటలు విని ఆయనను నమ్ముచుండగా దేవుడు మాత్రమే వీటిని ఇస్తాడు. కణమును హెచ్చరించమని ఆయన DNAను రూపించినట్లే, ఆయన మనలను ప్రేమించుచున్నాడు కాబట్టి, తన మహిమ కొరకు మరియు మన కొరకు, మన జీవితాలు సరిగా పని చేయునట్లు మనలను హెచ్చరించాలని ఆయన ఆశపడుచున్నాడు.

DNA ఎందుకు ముఖ్యమైనది? ఇది దేవునికి మరొక రుజువు. ఆయన మన శరీరాలను రూపించాడు. మీ జీవితాలను నిర్మించుటకు ఆయనను మీరు నమ్మవచ్చు. మీరు ఎన్నడైనా దేవునితో అనుబంధమును ఆరంభించారా? మీరు ఎలా చేయగలరో ఇది వివరిస్తుంది: దేవుని వ్యక్తిగతంగా తెలుసుకొనుట.

“దేవుడు నిజమేనా?” అను ప్రశ్నకు జవాబుగా మరిన్ని రుజువుల కొరకు చూడండి దేవుడు ఉన్నాడా?

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) Healthy-elements.com/atheists.html (2) Francis S. Collins, director of the Human Genome Project, The Language of God, (Free Press, New York, NY), 2006, p 1. (3) Ibid. (4) Ibid, p 125. (5) Ibid, p 102. (6) Perry Marshall, information engineer, cosmicfingerprints.com. (Other concepts in this article also may be attributed to Perry Marshall.) (7) Francis S. Collins, The Language of God, p 2. (8) Ibid, p 3.

ఇతరులతో పంచుకోండ  

TOP