జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

దేవుడు ఎందుకు గొప్ప అద్భుతాన్ని చేసి తన్ను తాను నిరూపించుకొవటంలేదు?

-Q: "ఈ రోజుల్లో కళ్ళతో చుసి నమ్మే అద్భుతాలు జరగట్లేదేమిటి?. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏ అనుమానం లేకుండా నమ్మేటట్లు- నిజంగా దేవుడున్నాడా!’''

మన జవాబు: దేవుని నమ్మటానికి మనలో అనేకమందికి బలమైనటువంటి, లెక్కలేనటువంటి కారణాలు కావాలి. అవును, బలమైన కారణాలతో మరియు తత్వఙ్ఞాన కారణాలతో కూడిన రుజువులు ఉన్నాయి (దేవుని ఉనికి అన్న అంశమును చూడండి).

కాని, దేవుడు ఎందుకు ప్రజలందరూ చూసి నమ్మేటట్లు బయటకి కనపడట్లేదు? ఈ ప్రశ్నకి మంచి జవాబును “ఫిలిప్ యాన్సి” పుస్తకమైన “ద జీసస్ ఐ నెవర్ న్యూ” లో వ్రాయబడింది.

యాన్సి మనకి చూపించేది ఏమిటంటే దేవుడు ప్రతి ఒక్కరికి తనను నమ్మటానికి, నమ్మకపోవటానికి నిర్ణయించుకునే స్వేచ్చను ఇచ్చాడు. మరియు ఆయన ఇలా చెప్పాడు," నా విశ్వాశం అధికమైన స్వేచ్చను కలిగి ఉండటం వల్ల ఎక్కువగా శోధించబడుతుంధి, నేను నమ్మకుండ ఉండటానికి అనేకమైన శోధనలను ఎదుర్కొంటున్నాను. కొన్నిసార్లు దేవుడు నన్ను ఆయన ఆధీనములోనికి తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది, మంచి రుజువులతో నా సందేహాలను తీరిస్తే బాగుంటుందనిపిస్తుంది, డేవుడు నిజంగా వున్నాడు అనే రుజువులను నాకు చూపిస్తే బాగుండుననిపిస్తుంది. సందేహాలు లేనటువంటి దేవుడు నాకు కావాలి, సందేహిస్తున్నటువంటి నా స్నేహితులను సందేహములేనటువంటి దేవుడు వైపు చూపించాలి." కాని ఆయన ఈ రీతిగా అంటారు,“నేను ఎంత ఎక్కువగా యేసుప్రభు వారి గురించి తెలుసుకుంటున్నానో అంత ఎక్కువగా నేను ప్రభావితం చెందుతున్నాను."ఆయనని తృణీకరించలేనటువంటి (డోస్టొవెస్కె ) చెప్పినట్లు మారుతునాను.”

ప్రజలను ఆశ్చర్యపరిచే అద్బుతాలను చుసి నమ్మే కార్యాలను యేసయ్య చేసి ఉండాల్సింది. మొత్తం గ్రామాన్ని ఒక మాటతో స్వస్థపరచి ఉండాల్సింది. ప్రస్తుతం ఉన్నటువంటి న్యూయార్క్ నగరాన్ని ఆయన తీసుకొని అక్కడ ఉన్న అతి ఎతైన భవనాల్ని, భూమి క్రింద మార్గములను విద్యుత్ నియాన్ బోర్డులను అందరి ఎదురుగా పడేసి ఉండాల్సింది.

కాని, యేసయ్య అలా ఎందుకు చెయ్యలేదు?

మానవులకు దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్చ మరియు నిర్ణయంతీసుకునే శక్తిని ఆయన ఎప్పుడు పరిగణలోనే ఉంచుకుంటాడు.

యాన్సి ఈ రీతిగా అంటాడు" ఆయనను తృణీకరించి ఆయనను అబురపరచడం కూడ ఎంతో ఆశ్చర్యమే. దేవుడు మానవులకి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం చాలా కశ్చితమైనది. నీకు ఇవ్వబడిన స్వేచ్చ నీ అంతట నువ్వు దేవుడిని విడిచిపెట్టే హక్కును కుడా ఇస్తుంధి, ఆయన మొహం మీద ఉమ్మి వెసేటట్టు చేస్తుంది. నేను నమ్మిందేమిటంటే దేవుడు ఈ రీతిగా మనుష్యుల మీద ఒత్తిడి కలుగ చేయకుండా ఆయన స్వేచ్చగా వ్యవహరించెటట్టు చేయడానికి కారణం ఏమిటంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఇష్టాలను ఇటువంటి ఒత్తుడలతో చేయించుకోడు. అధికారం ఒక వ్యక్తిని లోబడేడట్లు చెయగలిగినపట్టికిని, కేవలం ప్రేమ మాత్రమే తిరిగి ప్రేమతో స్పంధించేలా చేయగలదు, ఇది ముఖ్యమైన కారణం.

దేవుడు మనలను సృజించి మన నుండి ఆశించేది." దేవుడు మన దగ్గర నుండి కోరుతుంది ఏమిటంటే ఆయన తండ్రిగా, స్నేహితుడిగా, ఆదరణకర్తగా, ఆలోచనకర్తగా ప్రభువుగా - ఏ ఒత్తిడి లేకుండా నీవు తెలుసుకోవాలని ఆశిస్తునాడు.

దేవుని మనము విశ్వసించటానికి అనేక కారణాలను మనకి ఇస్తునాడు (ఉదహరణకి చూడండి బియ్యాండ్ బ్లెండ్ ఫేయిత్) కాని ఆయనని మనము తెలుసుకోటానికి ఏ ఒత్తిడి చేయడు. యేసుప్రభు వారు ఈ రీతిగ అన్నారు,”ఇధిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచునాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి తనతో నేనును, నాతోకూడా అతడును భోజనము చేయుదుము(ప్రకటన: 3:20) ." ఆయన మన అనుమతితో మన జీవితములోనికి రావటానికి ఇష్టపడుతునాడు. మనము నిజాయితీగా ఆయన గురించి తెలుసుకోటానికి ఆయన ఎలా ఉంటాడో అనే అవగాహన కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఆయని తెలుసుకోటానికి, కనుగొనటానికి ఆయన మనకి దారి చూపిస్తాడు.

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,
ఇతరులతో పంచుకోండ  

TOP