మెరిలిన్ అడంసన్
జీవితం ఎల్లప్పుడూ కొన్ని అర్హతలను కోరుతుంది. డ్రైవర్ లైసెన్స్ పొందుటకు, మీరు టెస్ట్ పాస్ అవ్వాలి. ఒక ఉద్యోగం సంపాదించుటకు, ఆ ఉద్యోగమునకు కావలసిన అర్హతలు మీ యొద్ద ఉన్నాయని చూపించాలి.
"A" ఉంటె "B" కూడా ఉంటుంది. మీ యోగ్యతను నిరూపించుకోండి. మీకు అర్హతలు ఉన్నాయని రుజువు చేయండి. మీరు “అంగీకార యోగ్యులని” నిరూపించండి.
దేవుడు మిమ్మును పూర్తిగా అంగీకరిస్తున్నాడని ఏ తరుణంలో మీరు తెలుసుకుంటారు?
మీరు ఎదుర్కొన్న మిగిలిన విషయాల వలె, “నేను ఇలా ఉన్నాను కాబట్టి అంగీకరించు...” అని ఖాళీని పూరించుట ద్వారా దేవునితో మీ అనుబంధం ఆరంభం అవ్వదు.
“నేను నిన్ను అంగీకరించుచున్నాను,” “నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను” అని దేవుడు చెప్పుట ద్వారా ఇది ఆరంభమవుతుంది.
మీరు గే అయినా, లెస్బియన్ అయినా, బైసెక్సువల్ (స్త్రీ, పురుష సంయోగులు) అయినా, లింగ మార్పిడి పొందినవారైనా లేక ప్రశ్నలు కలిగియున్నా, దేవుడు మన శత్రువు కాదు. మీరు దేవునితో అనుబంధం ఆరంభించని యెడల, ఆయన మీతో అనుబంధం కలిగియుండాలని ఆశపడుచున్నాడు. ఇది ఆయన అందరికి మరియు ఎవరికైనా ఇవ్వగలడు.
లేఖనాలలో, కేవలం ఒక గుంపు మాత్రమే యేసుకు ఎల్లప్పుడూ కోపం కలిగించింది...మతపరమైన స్వనీతిపరులు.
యేసు మిగిలినవారితో, అనగా వేశ్యలు మరియు దొంగలతో కూడా, మంచిగానే వ్యవహరించినట్లు కనిపిస్తుంది. అయితే, మత నాయకులు యేసును దుఖపరచారు. ఆయన వారిని న్యాయపరులుగా, అహంకారులుగా, ప్రేమలేనివారిగా, మరియు వేషదారులుగా చూశాడు.
ఈ మాటలు చూసిన వెంటనే, మీ పట్ల అహంకారంగా, కోపంగా, లేక న్యాయవాదులుగా వ్యవహరించిన మతపరమైన ప్రజలు మీకు గుర్తుకువచ్చియుండవచ్చు. అది యేసు హృదయానికి ప్రాతినిథ్యం వహిస్తుందా? లేదు. నిన్ను వలె నీ పోరుగువారిని ప్రేమించుమని యేసు చెప్పాడు. గాయపరచు మాటలు దానికి ఎలా చెందుతాయి? దానికి చెందవు.
ఇది బయలుపరచబడిన యేసు హృదయం. ఆయన అన్నాడు. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.”1
ఇప్పటి వరకు జీవించిన ప్రజలకు భిన్నంగా, యేసు మీకు జీవమును వివరించగలడు...మరింత పరిపూర్ణంగా జీవితమును ఎలా అనుభవించాలి. ఉనికిలో ఉన్న ప్రతి దానికి ఆయన సృష్టికర్త, అయినను మనం దేవుని తెలుసుకొనుటకు ఆయన మానవుడైయ్యాడు.
యేసును గూర్చి ఆయన స్నేహితులలో ఒకడైన యోహాను ఈ వ్యాఖ్య చేశాడు, “ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.”2
“కృప” అను పదం మనం ఎక్కువగా ఉపయోగించము. మనం సంపాదించకుండా దేవుడు మనకిచ్చిన దయ దాని అర్థం. ఈ సందిగ్ధ జీవితములో మనలను నడిపించుటకు యేసు తన దయ మరియు సత్యమును మనకు ఇచ్చుచున్నాడు.
దేవునిచే అంగీకరించబడుటకు ఏమి చెయ్యాలి అని నేను ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని. మీరు కూడా అంతగానే ఆశ్చర్యపడతారేమో. ఇది చూడండి:
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.”3
మీకు అర్థమైయిందా? “ఆయన యందు విశ్వసించు ప్రతివారు.” ఆయన యందు విశ్వసించు ప్రతివారికి నిత్యజీవముంది. ఆయనను నమ్ము ప్రతివారు ఆయన ద్వారా రక్షించబడతారు. ఆయనయందు విశ్వాసముంచువారెవ్వరు శిక్షించబడరు.
ఆయన మనలను అడిగేది ఇదే... ఆయనయందు విశ్వాసముంచమని.
యోహాను యేసును గూర్చి చెప్పాడు, “ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను...”4
ఆయన కేవలం ఒక ప్రవక్త లేక బోధకుడు లేక మత నాయకుడు మాత్రమే కాదు. ఆయనను తెలుసుకొనుట దేవుని తెలుసుకొనుట అని యేసు చెప్పాడు. ఆయనను నమ్ముట దేవుని నమ్ముట. అందువలనే ఆయన సిలువవేయబడెను. ఆయనపై దైవదూషణ నేరము మోపారు. “దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను”5 అని ప్రజలు యేసును గూర్చి చెప్పారు.
ఆయన రుజువును ఇచ్చాడు. ఏ మానవుడు చేయని పనులు యేసు అప్పటికీ చేశాడు, గ్రుడ్డివారిని, కుంటివారిని, లేక అనేక రోగములతో బాధపడుతున్నవారిని వెంటనే స్వస్థపరచాడు.
అయినను యేసు దానిని మించి వెళ్లాడు. ఆయన పట్టబడి, కొట్టబడి, సిలువవేయబడి...మరణము నుండి మూడు దినముల తరువాత తిరిగిలేస్తాడని అయన అనేక పర్యాయములు చెప్పాడు. అది బలమైన రుజువు. తరువాత పునర్జన్మ కాదు, లేక వింతగా “మీరు నన్ను కళలలో చూస్తారు” అని కూడా చెప్పలేదు. సమాధిచేయబడిన మూడు దినముల తరువాత, ఆయన మరణము నుండి తిరిగిలేస్తాడు.
రోమీయులకు దీనిని గూర్చి తెలుసు కాబట్టి యేసు సమాధి యొద్ద సైనికులకు కాపలా ఉంచారు.
అయినను, హింసించబడి సిలువలో చంపబడిన మూడు దినముల తరువాత, యేసు శారీరకముగా సమాధి నుండి తిరిగిలేచాడు. ఆయన శరీరం వెళ్లిపోయింది, కేవలం ఆయనను కప్పిన వస్త్రములు మాత్రమే మిగిలిపోయాయి. తరువాత 40 రోజుల పాటు ఆయన అనేక పర్యాయములు శారీరికంగా కనిపించాడు. అది క్రైస్తవ విశ్వాసమును ఆరంభించింది. ఆయన ఏమైతే చెప్పాడో అది చేస్తాడని నిరూపించాడు...శరీరదారియైన దేవుడు, తండ్రియైన దేవునితో సమానుడు.
యేసు దీనిని గూర్చి స్పష్టంగా చెప్పాడు: “తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను.”6
మీరు దేవునిచే ప్రేమించబడితిరి అని ఎరిగి ఈ జీవితమును మేరు గడపవచ్చు.
ప్రేమ కొరకు అందరు ఆకలికలిగియున్నారు. మానవ’ ప్రేమ అవసరం. అయినను మానవులు సంపూర్ణులు కారు కాబట్టి, వారి ప్రేమ సంపూర్ణం కానిది.
కాని దేవుడు మిమ్మును సంపూర్ణంగా ప్రేమించగలడు. ఆయన స్వభావం ప్రేమించునది కాబట్టి, అది ఎన్నడు మారదు కాబట్టి, ఆయన మనలను ప్రేమించుచున్నాడు.
మనం తికమక పడిపోతాము. మనం మన సొంత స్థాయిలో జీవించలేకపోతాము, దేవుని స్థాయిని ప్రక్కన పెట్టండి. కాని మన ప్రదర్శన ఆధారంగా అయన మనలను అంగీకరించడు. ఆయనను నమ్మి, ఆయన యొద్దకు వచ్చి, మన జీవితములకు దేవునిగా ఆయనను ఆహ్వానించినట్లైతే ఆయన మనలను అంగీకరిస్తాడు.
ఆయనతో అనుబంధం కలిగియుండుటను యేసు ఈ విధంగా వివరిస్తాడు:
“తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ.”7
మీరు మీ జీవితంలో కలిగియున్న ప్రతి ప్రాముఖ్యమైన అనుబంధం మీపై ప్రభావం చూపింది, భావర్థకంగా లేక అభావర్థకంగా. అవునా? ఇది అందరి జీవితాలలో సత్యమే. అనుబంధం ఎంత ప్రాముఖ్యమైనదైతే అంత ప్రభావం చూపుతుంది.
కాబట్టి, దేవుని తెలుసుకొనుట ప్రాముఖ్యమైన అనుబంధం అనుటలో సత్యముంది. ఆయన ప్రేమ అనుసారంగా మరియు మీ జీవితం కొరకు ఆయన ఆశ ఆధారంగా ఆయన మీ జీవితాలను నడుపుతాడు. అప్పటికీ మీరే నిర్ణయాలు తీసుకుంటారు. మీ స్వచిత్తమును మీరు ఉపయోగిస్తారు. ఆయన ఇష్ట ప్రకారం జీవించునట్లు మిమ్మును బలవంతపెడుతూ ఆయన మీ జీవితాలను స్వాధీనంలోనికి తీసుకొనడు. అయినను, ఆయన వివేకం, ఆయన దయ, మరియు దేవుడు ప్రజలను మరియు జీవితమును చూచే విధానం ద్వారా నేను బహుగా ప్రభావితమైయ్యాను.
సమాజం ఇచ్చే ఆజ్ఞల ఆధారంగా దేవుడు నిర్ణయాలు తీసుకోడు. లోకమును సృష్టించిన సృష్టికర్తకు సమాజం యొక్క మార్గదర్శకాలు అవసరం లేదు, అవును కదా? ఇది నాకు ఇష్టం. నాకు స్వతంత్రత వచ్చినట్లు ఉంది.
ఆయనతో అనుబంధమును ఆరంభించినప్పుడు దేవుడు నాకు ఇది చేశాడు.
నేను ఒక నాస్తికునిగా ఉండేవాడిని. దేవుని నమ్ముట, ఆయనను గూర్చిన బైబిల్ చదువుట నా జీవితంలో ఒక గొప్ప మార్పు. అది అత్యంత ప్రాముఖ్యమైనది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా?
యేసును నా జీవితంలోనికి ఆహ్వానించిన కొన్ని నెలల తరువాత నా సన్నిహిత స్నేహితురాలు నన్ను ఇలా అడిగాడు, “నీ జీవితంలో మార్పును నీవు గమనించావా?” “అంటే ఏంటి?” అని నేను అడిగాను. “ఈ మధ్య నేను నీతో విషయాలను పంచుకోగలను మరియు నీవు నన్ను హేళన చేయుట లేదు. నీవు నిజంగా నా మాటలు వినుచున్నావు” అని ఆమె అన్నది.
నాకు కొంత ఇబ్బంది కలిగింది. అంటే, చివరికి నేను ఒక మానవుని వలె వ్యవహరిస్తూ ఆమె మాటలు వినుచున్నానని నా సన్నిహిత స్నేహితురాలు నాకు చెబుతుంది!
(నా జీవితంలో తాను గమనిస్తున్న విషయాలను చూసి ఆమె ఆశ్చర్యపోతుంది, మరియు ఆమె కూడా యేసును తన జీవితంలోనికి ఆహ్వానించుటకు నిర్ణయించుకుంది.)
నేను దేవునితో అనుబంధం ఆరంభించినప్పుడు, నా పట్ల ఆయన ప్రేమను నేను గ్రహించాను. అది నన్ను ఆశ్చర్యపరచింది. నేను బైబిల్ లో చదివిన విషయములు ఆయన నన్ను ఎంతగా ప్రేమించుచున్నాడో అని నాకు తెలుపు వ్యక్తిగత సందేశాలుగా నేను భావించాను. (ఆయనకు అనుగుణంగా లేనందుకు దేవునికి మన పైన కోపం ఉందని ఆలోచిస్తూ నేను ఎదిగాను.) దేవుడు మనలను ప్రేమించుచున్నాడు అనునది నాకు ఆశ్చర్యకరమైన విషయం.
ప్రేమ కొరకు నా మానసిక అవసరత దేవుడు లోతైన విధంగా తీర్చినందున నేను మానసికంగా భద్రత కలిగిన వ్యక్తిగా మారాను. నేను నా కంటే ఎక్కువగా ఇతరులను గూర్చి ఆలోచించుట మరియు వారిపై శ్రద్ధ చూపుట ఆరంభించాను. మరియు నేను ఎక్కువగా వినుట మరియు ఎక్కువగా శ్రద్ధ తీసుకొనుట ఆరంభించాను. నేను ఎదుగుతున్న రోజులలో ఉన్న జాతివాదం నాలో తగ్గుట ఆరంభించింది.
ఆయన మనకు బోధించుటకు మరియు నడిపించుటకు అవకాశమిచ్చుట ద్వారా, “అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని”8 అని యేసు వాగ్దానం చేస్తున్నాడు.
మీరు యేసుతో అనుబంధమును ఆరంభించినట్లైతే, మీ వైకరిలో, లేక నిరీక్షణలో, లేక మీరు ఇతరులను చూసే విధానంలో, లేక మీరు సమయమును గడుపు విధానంలో మార్పులు చూడవచ్చు. కేవలం దేవునికి మాత్రమే తెలుసు. కాని ఆయనను మీరు తెలుసుకొనుచుండగా, ఆయన మీ జీవితం మీద ప్రభావం చూపుతాడు. యేసును అనుసరించు ఎవరినైనా అడగండి, మరియు ఆయనను తెలుసుకొనుట వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందో వారు చెబుతారు.
ఆయన మార్గములను ఎన్నుకొనుటకుమనకు ఆయన గొప్ప ఆశను ఇస్తాడు. ఆయన దీనిని ఎలా చేస్తాడు అనేది ఊహించలేనిది. అంటే ఆయన మీకు క్రొత్త ఆజ్ఞలు ఇస్తాడని కాదు. ఇది స్వయం కృషి కాదు లేక దేవుని సంతోషపెట్టాలనే కృషి కూడా కాదు. ఇది అనుబంధం, దేవునితో సాన్నిహిత సాంగత్యం. ఇది దేవుడు మిమ్మును వ్యక్తిగతంగా నడిపించుట, మరియు జీవితమును గూర్చి తనను గూర్చి ఆయన మీకు నేర్పించుట. ఆయనను మనం ఆహ్వానించినప్పుడు ఆయన మన జీవితాలలోనికి వస్తాడు. మరియు మన జీవితాలపై హృదయాల ద్వారా ఆయన ప్రభావం చూపుతాడు.
యేసు మీకు జీవమును ఇచ్చుచున్నాడు. అనుబంధాలు, ఉద్యోగములు, ఆటలు, వినోదం...వీటన్నిటిలో గొప్ప క్షణాలు ఉన్నాయని, కాని పరిపూర్ణత మాత్రం ఊరిస్తుందని మీకు తెలుసు. దానిలోని సంతృప్తి మనలను సంపూర్ణం చేయదు. మరియు భూమి మీద ఏది కూడా మనకు సంతృప్తిని ఇవ్వలేదు.
స్థిరముగా ఉండుదాని కొరకు, ఆధార యోగ్యమైన దాని కొరకు మనకు నిరంతర ఆకలి ఉంటుంది. యేసు చెప్పాడు, “జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.”9 ఆయన “నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను”9 అను మాటతో తన కథనమును ముగిస్తాడు. ప్రతి పరిస్థితిలో అన్ని వేళలలో ఉపయోగపడు ఒక జీవిత తత్త్వము కొరకు నేను అనేక సంవత్సరాలుగా వెదికాను. నేను దేవుని తెలుసుకున్నప్పుడు, నా వెదుకులాట ముగిసింది. ఆయన నమ్మదగినవాడని నేను కనుగొన్నాను.
మీరు ఇతరులందరితో కలిగియున్న అనుబంధం కంటే ఆయనతో మీ అనుబంధం వేరుగా ఉంటుంది. మీరు విశేష అనుభవాలు, ఆలోచనలు, ఆశక్తులు, కళలు, అవసరతలు కలిగియున్న వ్యక్తులు. సువార్తలను చదవండి మరియు యేసు వ్యక్తులతో వ్యక్తిగతంగా అనుబంధం కలిగియుండుట మీరు చూస్తారు.
దేవునితో అనుబంధమునకు అర్థం జీవితంలో కష్టమైన పరిస్థితుల నుండి మీకు ఎల్లప్పుడూ కవచం లభిస్తుందని నిర్థారణ కాదు. మీరు ఆర్థిక సమస్యలను, అనారోగ్యమును, దుర్ఘటనలను, భూకంపములను, అనుబంధంలో వేదనలను అనుభవించవచ్చు.
ఈ జీవితంలో శ్రమలు ఉన్నవి అనుటకు ఎలాంటి సందేహం లేదు. మీరు వాటిని ఒంటరిగా ఎదుర్కొనవచ్చు. లేక వాటి మధ్యలో దేవుని ప్రేమ, ఆయన సన్నిధి మరియు ఆప్యాయతను గూర్చి నిశ్చయత కలిగియుండవచ్చు.
ఇక్కడ మరొక హెచ్చరిక ఉంది. ఇతరులకు సహాయం చేయుటకు ఆయన మిమ్మును కష్టమైన ఉద్యోగాలు, వ్యక్తిగత బలిదానములలోనికి నడిపించవచ్చు.
క్రీస్తు శిష్యులలో అనేకులు (మరియు నేడు క్రీస్తు అనుచరులు అనేకులు) గొప్ప శ్రమలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు, పౌలు తరచుగా అరెస్ట్ చేయబడ్డాడు, కర్రలతో కొరడాలతో కొట్టబడ్డాడు, అనేకసార్లు. ఒకసారి అల్లరి మూక మరణించునంత వరకు రాళ్ల
తో కొట్టి చంపారు. అనేకసార్లు ఓడ పగిలిపోయింది, తరచుగా ఆహారం లేకుండా మరియు ప్రాణం కొరకు పరిగెడుతూ అనేక దినములు గడిపాడు.
స్పష్టముగా, యేసు అనుచరులు సులువైన జీవితాలు జీవించలేదు. అయినను పౌలు మరియు ఇతర విశ్వాసులు, వారి పట్ల దేవుని ప్రేమను గూర్చి నిర్థారణ కలిగియున్నారు.
పౌలు వ్రాస్తున్నాడు, “అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.”10
మీ దారిని మీరు నిర్థారించుకొనవద్దు. మీరు గే, లెస్బియన్, బైసెక్సువల్, లింగమార్పిడి చేసుకున్నవారు, లేక మీ లైంగిక స్థితిని గూర్చి అనుమానాలు కలిగియుంటే...యేసుకు మీరు అవకాశమిస్తే, ఆయన మీ జీవితాలను నడిపిస్తాడు. మరియు అది మీ ఊహకు మించినది. యేసు చెప్పాడు, “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండును.”11
మీ జీవితంలో మీరు ఏమి చేసినప్పటికీ, యేసు మీకు సంపూర్ణ క్షమాపణను ఇస్తాడు. మన పాపం కేవలం ఉపేక్షించబడలేదు. సిలువలో యేసు మన కొరకు మరణించి దాని వెల చెల్లించాడు.
మీ కొరకు ఎవరైనా ఎప్పుడైనా త్యాగం చేశారా? యేసు అత్యున్నత స్థాయిలో చేసింది ఇదే. ఆయన మిమ్మును అంతగా ప్రేమించుచున్నాడు. ఆయన మీ హృదయములోనికి ప్రవేశించి మీతో అనుబంధం కలిగియుండాలని ఆశపడుతున్నాడు.
మీరు దేవుని తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? మీరు ఇప్పటి వరకు ఆయనను ఆహ్వానించకపోతే, మీ జీవితములోనికి ఆయనను ఆహ్వానించమని మిమ్మును ప్రోత్సహిస్తాను. ఈ అనుబంధం మనలను సంతృప్తిపరుస్తుందని ఆయన చెబుతున్నాడు. ఆయన లేకుండా ఈ జీవితమును గడుపుటకు మనం చేయబడలేదు.
మీకు నచ్చిన పదములతో ఆయనతో మీరు మాట్లాడవచ్చు. మీకు సహాయం అవసరమైతే, మీరు ఇలా చెప్పవచ్చు:
“యేసు, నేను నిన్ను నమ్ముచున్నాను. నా కొరకు మరణించి, నీతో అనుబంధమును నాకు ఇచ్చినందుకు వందనాలు. నా జీవితానికి నీకు రాజైయుండాలని ఆశపడుచున్నాను, నేను ఈ క్షణమే నిన్ను తెలుసుకోవాలని, నీ ప్రేమను అనుభవించాలని కోరుతున్నాను, నా జీవితమును నడిపించమని వేడుకొనుచున్నాను.”
► | యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......) |
► | ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి |
► | నాకు ఒక ప్రశ్నఉన్నది,,, |
(1) మత్తయి 11:28-29 (2) యోహాను 1:16,17 (3) యోహాను 3:16-18 (4) యోహాను 1:11,12 (5) యోహాను 5:18 (6) యోహాను 5:22-24 (7) యోహాను 15:9-12 (8) యోహాను 8:32 (9) యోహాను 6:35,37 (10) రోమా. 8:37-39 (11) యోహాను 8:12