దేవుడు ఉన్నాడని ఎవరైనా మీకు ఒక సులువైన రుజువును చూపిస్తే మీకు సంతోషం అనిపించదు? ఎలాంటి బలవంతము లేదు. “నువ్వు నమ్మాలంతే,” అనే మాటలు లేవు. సరే, దేవుడు ఉన్నాడనుటకు కొన్ని కారణాలు ఇవ్వడానికి ఇది ఒక ప్రయత్నం.
అయితే మొదట దీనిని గమనించండి. దేవుని ఉనికి యొక్క సాధ్యత విషయానికి వస్తే, కావలసినంత రుజువును చూసి, దేవుని గూర్చిన ఆ సత్యమును అణచివేసిన ప్రజలు ఉన్నారని బైబిల్ చెబుతుంది.1 మరో వైపు, దేవుడు ఉంటే తెలుసుకోవాలనుకొని వారితో ఆయన చెబుతున్నాడు, “....”2 దేవుని ఉనికిని గూర్చిన నిజాలను చూచుటకు ముందు, మిమ్మును మీరు అడగండి, దేవుడు నిజముగా ఉంటే, నేను ఆయనను తెలుసుకోవాలనుకొంటున్నానా? అయితే, గుర్తించవలసిన కొన్ని కారణాలు ఇవే . . .
దేవుని సృష్టికి ఎలాంటి అంతము లేకుండా అనేక ఉదాహరణలు ఇవ్వ వచ్చు. కాని ఇక్కడ కొన్ని ఇవ్వబడినవి చూడండి:
భూమి . . . దీని కొలత పూర్ణమైనది. భూమి యొక్క కొలత మరియు దాని యొక్క గ్రహణ శక్తి భూమి ఉపరితలం నుండి కేవలం 50 మైళ్ళ దూరం మాత్రమే దానిపై ఆక్సిజన్ మరియు నైట్రోజన్ తో కూడిన సన్నటి పొరను కలిగియుంది. భూమి చిన్నగా ఉంటే బుధగ్రహం వలె ఒక వాతావరణం అసాధ్యమవుతుంది. భూమి కొంచెం పెద్దగా ఉంటే, గురు గ్రహము వలె, వాతావరణంలో హైడ్రోజన్ కొలత ఎక్కువైపోతుంది.3 చెట్లు, జంతువులు మరియు మానవ జీవమునకు అవసరమైన పరిమాణంలో వాయువులు కలిగిన వాతావరణం కలిగిన గ్రహం భూమి మాత్రమే.
భూమి సూర్యుని నుండి తగిన దూరంలో ఉంది. మనం ఎదుర్కొను ఉష్ణోగ్రత -30 నుండి +120 మధ్య మాత్రమే పెరుగుతూ తగ్గుతుంటుంది. భూమి ఒకవేళ సూర్యుని నుండి ఇంకొంత దూరంగా ఉంటె, మనమంతా గడ్డకట్టేవారం. ఇంకొంత దగ్గరగా ఉంటే మనం కాలిపోయేవారం. భూమి ఇప్పుడు ఉన్న స్థానం నుండి కొంత స్థాన మార్పు జరిగినా సరే భూమి మీద జీవనం అసాధ్యమవుతుంది. గంటకు 67,000 మైళ్ళ వేగంతో తిరుగుతున్నప్పటికీ, భూమి సూర్యుని నుండి ఖచ్చితంగా ఇంతే దూరము కలిగియుంటుంది. ప్రతి దినము భూమి ఉపరితలం అంతా తగిన వేడిని చలిని పొందుకొనుటకు వీలుగా అది తన సొంత అక్షరేఖలో తిరుగుతుంది.
మరియు మన చంద్రుడు భూమి యొక్క గ్రహణ శక్తికి అందుబాటులో ఉండుట కొరకు అది భూమి నుండి తగిన దూరములో పూర్ణమైన పరిమాణంలో ఉంది. సముద్ర నీరు నిలిచిపోకుండా చంద్రుడు సముద్రము యొక్క అలలను కలిగిస్తుంది, అయినను మన సముద్రాలు తమ నీటితో భూమిని నింపకుండా ఉన్నాయి.4
నీరు... రంగు లేదు, వాసన లేదు మరియు రుచి లేదు, అయినను ఏ ప్రాణి కూడా అది లేకుండా జీవించలేదు. చెట్లు, జంతువులు, మరియు మానవులు చాలా వరకు నీటితో చేయబడ్డారు (మానవ శరీరములో మూడు వంతులు నీరే ఉంటుంది). నీటి యొక్క గుణాలు జీవమునకు ఎంత అనుగుణంగా ఉంటాయో మీరు చూడవచ్చు:
నీటి యొక్క మరుగు బిందువు నుండి గడ్డ కట్టు బిందువు మధ్య పెద్ద తేడా ఉంది. మారుతున్న ఉష్ణోగ్రతలు కలిగిన వాతావరణంలో నీరు మన జీవనమును సాధ్యము చేసి, మన శరీరాలను 98.6 డిగ్రీల వద్ద స్థిరంగా ఉంచుతుంది.
నీరు సార్వత్రిక ద్రావకం. నీటి యొక్క ఈ గుణం యొక్క అర్థం ఏమిటంటే, పలు రసాయనాలు, మినరల్స్ మరియు పోషకాలు మన శరీరములలో మరియు చిన్న చిన్న రక్త కణములలోనికి వెళ్లగలుగుతాయి.5
రాసాయన పరంగా కూడా నీరు తటస్థమైనది. అది తీసుకొనివెళ్లు వస్తువులను మార్చకుండా, ఆహారం, మందులు, మరియు మినరల్స్ శరీరములో ఇంకి ఉపయోగపడుటలో నీరు సహాయం చేస్తుంది.
నీటికి విశేషమైన తలతన్యత ఉంది. కాబట్టి చెట్లలో నీరు భూమి యొక్క గ్రహణ శక్తికి విరోధంగా పైకి ప్రవహిస్తుంది, మరియు అత్యంత పొడవైన చెట్లకు కూడా జీవమునిచ్చు నీరు మరియు పోషకాలను ఇస్తుంది.
నీరు పై నుండి క్రిందికి గడ్డ కట్టి, శీతాకాలంలో చేపలు జీవించుటకు సహాయపడుతుంది.
భూమి యొక్క తొంభై ఏడు శాతం నీరు మహా సముద్రాలలో ఉంటుంది. కాని మన భూమి మీద, నీటి నుండి ఉప్పును తొలగించి భూగోళం అంతటికి నీటిని అందించు ఒక వ్యవస్థ రూపించబడియుంది. ఆవిరి సముద్రములోని ఉప్పును విడిచిపెట్టి నీటిని తీసుకుంటుంది, మరియు భూమిపై అన్ని చోట్ల సులువుగా వెళ్లి పంటలకు, జంతువులకు మరియు ప్రజలకు కావలసిన విధంగా నీళ్లను అందించునట్లు మేఘములను కలిగిస్తుంది. ఇది ఈ భూమిపైన జీవనమును సాధ్యము చేయు శుద్ధి మరియు సరఫరా వ్యవస్థ, రీసైకిల్ మరియు పునర్వినియోగం చేయబడిన నీటి యొక్క వ్యవస్థ.6
మానవ మెదడు . . . ఒకే సారి గొప్ప సమాచారమును అది విశ్లేషిస్తుంది. మీరు చూసే రంగులు మరియు వస్తువులను, మీ చుట్టూ ఉండు వాతావరణమును, భూమిపైన మీ పాదముల తాకిడిని, మీ చుట్టూ ఉండు శబ్దములను, మీ నోరు తడారిపోవుటను, చివరికి మీ కీబోర్డ్ యొక్క రూపమును కూడా మీ మెదడు తీసుకుంటుంది. మీ మెదడు మీ భావనలను, ఆలోచనలను, మరియు జ్ఞాపికలను తీసుకొని వాటిని విశ్లేషిస్తుంది. అదే సమయంలో మీ మెదడు మీ శరీరములో జరుగుచున్న శ్వాశకోశ, కను రెప్పల అలికిడి, ఆకలి మరియు మీ చేతులలోని ఎముకల యొక్క అలికిడిని గమనిస్తుటుంది.
మానవ మెదడు క్షణానికి పది లక్షల కంటే ఎక్కువ సందేశాలను విశ్లేషిస్తుంది.7 మీ మెదడు ఈ సమాచారములోని ప్రాముఖ్యమైనవాటిని గమనించి, ప్రాముఖ్యం కానివాటిని విడిచిపెడుతుంది. ఈ విశ్లేషించు ప్రక్రియ మీ జీవితములో మీరు ముఖ్యమైన విషయములపై దృష్టి పెట్టి ప్రభావవంతంగా పని చేయుటలో సహాయపడుతుంది. మెదడు ఇతర శరీర అంగముల కంటే భిన్నంగా పని చేస్తుంది. దానికి జ్ఞానముంది, తర్కించు, భావనలు కలిగించు, కలలు కను మరియు ప్రణాళిక చేయు, కార్యము చేయు మరియు ఇతరులతో అనుబంధం కలిగియుండు శక్తి ఉంది.
కన్ను . . . డెబ్బై లక్షల రంగులను గుర్తుపట్టగలదు. దానికి ఒకే సారి పదిహేను లక్షల రంగులపై దృష్టి పెట్టి వాటిని శాసించగల శక్తి ఉంది.8పరిణామ సిద్ధాంతంఉనికిలో ఉన్న జీవుల నుండి మార్పులు చెందుట మరియు కుదించబడుటపై దృష్టి పెడుతుంది. అయినను కన్ను లేక మెదడు యొక్క ఆదిమ మూలమును - - అజీవుల నుండి జీవుల యొక్క ఆరంభమును పరిణామ సిద్ధాంతమును పూర్తిగా వివరించదు.
శక్తి మరియు వెలుగు యొక్క గొప్ప విస్పోటం కారణంగా మన లోకము ఆరంభమైయింది అని వైజ్ఞానికులు అంటారు, మరియు దానినే మనం ఇప్పుడు బిగ్ బ్యాంగ్ అని పిలుస్తాము. ఉనికిలో ఉన్న ప్రతి దానికి ఇదే ఏకైక ఆరంభం: లోకము యొక్క ఆరంభం, ఆకాశం యొక్క ఆరంభం, మరియు సమయం యొక్క ఆదిమ ఆరంభం కూడా.
తన్ను తాను నాస్తికునిగా పిలుచుకొనే ఖగోళశాస్త్రవేత్తయైన Robert Jastrow, ఇలా అన్నాడు, "లోకములో జరిగిన ప్రతి దానికి విత్తనం ఆ మొదటి సమయంలో నాటబడినది; ప్రతి తార, ప్రతి గ్రహం మరియు లోకంలోని ప్రతి జీవి ఆ సర్వ లోక విస్పోట సమయంలో జరిగిన సన్నివేశాలకు పరిణామంగా కలిగాయి. . . విశ్వం ఒక్క సారిగా కలిగింది, మరియు దానికి కారణం ఏమిటో మనం కనుగొనలేము.”9
భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి అందుకున్న Steven Weinberg, అన్నాడు గదా, ఆ విస్పోటం జరిగిన సమయంలో, “విశ్వము కొన్ని వందల వేల లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత కలిగియుంది . . . మరియు విశ్వం వెలుగుతో నిండియుంది.”10
విశ్వము ఎల్లప్పుడూ ఉనికిలో లేదు. దానికి ఒక ఆరంభం ఉంది... ఆ ఆరంభమును ఏమి కలిగించింది? వెలుగు మరియు వస్తువుల యొక్క శీఘ్ర విస్పోటమునకు వివరణ శాస్త్రవేత్తల యొద్ద లేదు.
జీవితంలో చాలా వరకు అనిశ్చితి ఉన్నప్పటికీ, మనం ప్రతి రోజు నమ్మదగిన కొన్ని విషయాలను చూడండి: భూమి యొక్క గ్రహణ శక్తి స్థిరంగా ఉంటుంది, బల్ల మీద విడిచిపెట్టిన వేడి కాఫీ చల్లబడిపోతుంది, భూమి అదే 24 గంటల వ్యవధిలో భ్రమణం చేస్తుంది, మరియు వెలుగు యొక్క వేగం మారదు – భూమి పైన లేక మనకు దూరంగా ఉన్న నక్షత్ర మండలాలలో కూడా.
ఎన్నడు మారని ప్రకృతి చట్టాలను మనం ఎలా గుర్తించగలము? ఈ విశ్వం ఎందుకు అంత క్రమముగా ఉంది, ఎందుకు అంత నమ్మదగినది?
"గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ వింతను చూసి ఆశ్చర్యపోయారు. నియమాలను పాటించవలసిన తర్కపరమైన అవసరత విశ్వమునకు లేదు, గణిత శాస్త్రమును అనుసరించు నియమాలను ప్రక్కన పెట్టండి. విశ్వం ఈ విధంగా వ్యవహరించవలసిన పని లేదు అనే గుర్తింపు నుండి ఇట్టి ఆశ్చర్యం వెలువడుతుంది. పరిస్థితులు ఊహించని విధంగా మాటమాటకు మారే విశ్వమును గూర్చి ఊహించుట, లేక వస్తువులు ఉనికిలోనికి వచ్చి పోయే విశ్వమును గూర్చి ఊహించుట చాలా సులభం.”11
క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ లో నోబుల్ బహుమతిని అందుకున్న Richard Feynman ఇలా అన్నాడు, “ప్రకృతి గణిత శాస్త్రపరంగా ఉండుట ఎందుకు రహస్యం...నియమాలు ఉన్నాయి అనుటయే ఒక అద్భుతం.”12
అన్ని హెచ్చరికలు, అన్ని బోధలు, అన్ని తర్ఫీదులు ఒక తీర్మానంతో వస్తాయి. ఒక హెచ్చరిక మార్గదర్శిని వ్రాయువాడు దానిని ఒక ఉద్దేశంతో వ్రాస్తాడు. మన శరీరములో ఉన్న ప్రతి కణంలో ఒక చిన్న కంప్యుటర్ ప్రోగ్రాం వలె చాలా వివరణాత్మకమైన హెచ్చరిక కోడ్ ఉంటుందని మీకు తెలుసా? మీకు తెలిసియుండవచ్చు, ఒక కంప్యూటర్ ప్రోగ్రాం ఈ విధంగా సున్నా మరియు ఒకటితో చేయబడుతుంది: 110010101011000. అవి అమర్చిన విధానం కంప్యూటర్ ప్రోగ్రాంకు ఏమి చెయ్యాలో చెబుతుంది. మన కణాలన్నిటిలో ఉన్న DNA కోడ్ ఒకే విధంగా ఉంది. శాస్త్రజ్ఞులు A, T, G, C అని పిలిచే నాలుగు రసాయనాలతో ఇది చేయబడుతుంది. మానవ కణంలో ఇవి ఈ విధంగా అమర్చబడ్డాయి: CGTGTGACTCGCTCCTGAT మొదలగునవి. ప్రతి మానవ కణంలో ఇలాంటివి మూడు బిలియన్ల అక్షరాలు ఉంటాయి.
సరే, పలు కారణాల కొరకు వేర్వేరుగా మ్రోగునట్లు మీ ఫోన్ ను మీరు ప్రోగ్రాం చేసినట్లే, DNA కణాలను హెచ్చరిస్తుంది. DNA అనునది ఒక కణమును ఒక మార్గములో పని చేయమని హెచ్చరించు మూడు-బిలియన్-అక్షరాలు కలిగిన ప్రోగ్రాం. అది పూర్తి హెచ్చరిక మార్గదర్శి.13
ఇది ఎందుకు అంత అద్భుతమైనది? ప్రతి మానవ కణంలో ఇట్టి ప్రోగ్రాం సమాచారం ఎలా ఇమిడియుంది ... అని మనం అడగాలి? ఇవి కేవలం రసాయనాలు మాత్రమే కాదు. ఇవి హెచ్చరించు రసాయనాలు, మరియు ఒక వ్యక్తి యొక్క శరీరం ఎలా పని రూపించబడాలో ఈ కోడ్ వివరిస్తుంది.
ప్రోగ్రాం చేయబడిన సమాచారమును గూర్చిన వివరణను ప్రాకృతిక మరియు జీవశాస్త్ర కారణాలు పూర్తిగా ఇచ్చుటలో విఫలమవుతున్నాయి. ఒకరు కావాలని రూపించకుండా ఇట్టి సమాచారమును మరియు స్పష్ట సమాచారమును మనం పొందలేము.
నేను ఒకప్పుడు నాస్తికుడను. మరియు నాస్తికులందరి వలె, ప్రజలు దేవుని నమ్ముట నన్ను ఇబ్బంది పెట్టేది. నాస్తికులు ఉనికిలో ఉందని కూడా నమ్మని దానిని తిరస్కరించుటకు చాలా సమయమును, శ్రద్ధను మరియు శక్తిని ఎందుకు వెచ్చిస్తారు?! మేము అలా చేయుటకు ఏమి పురికొల్పుతుంది? నేను నాస్తికునిగా ఉన్నప్పుడు, నా ఆలోచనలను ఆ పేద, అవగాహన లేని ప్రజలకు సహాయం చేయుటకు ... వారు పెట్టిన ఆశలు సరైనవి కావని చెప్పుటపై ఆధారం చేసేవాడిని. నిజాయితీగా, నాకు వేరే ఉద్దేశాలు కూడా ఉండేవి. దేవుని నమ్మువారికి నేను సవాల్ చేస్తుండగా, వారు నన్ను దేవుడు ఉన్నాడని నమ్మిస్తారని ఆశతో ఎదురుచూసేవాడిని. దేవుని గూర్చిన ప్రశ్న నుండి స్వతంత్రం కావాలని కూడా నేను కోరేవాడిని. వారు తప్పని విశ్వాసులకు నిరూపించు, ఆ విషయమును ముగించి నేను ముందుకు సాగాలని ఆశపడేవాడిని.
దేవుని గూర్చిన అంశం నా మదిలో ఇంతగా మెదులుటకు కారణం, దేవుడు ఆ సమస్యను నాకు చూపుతున్నాడని నేను గుర్తించలేదు. దేవుడు తెలియబడాలని కోరుతున్నాడని నేను కనుగొన్నాను. మనం ఆయనను తెలుసుకోవాలని ఆయన మనలను సృష్టించాడు. ఆయనను గూర్చిన రుజువులతో మనలను నింపి మనం స్వయంగా ఆయనను తెలుసుకోవాలని కోరుతున్నాడు. దేవుని యొక్క ఉనికిని గూర్చి ఆలోచించకుండా నేను ఉండలేను అన్నట్లుగా ఉండేది. వాస్తవానికి, దేవుని ఉనికిని అంగీకరించాలని నేను నిర్ణయించుకున్న రోజు, నా ప్రార్థన ఇలా ఆరంభమైయింది, “సరే, నువ్వే గెలచావు...” దేవుని నమ్ము వారిని గూర్చి నాస్తికులు చింతించుటకు కారణం దేవుడు వారిని పురికొల్పుట కావచ్చు.
దీనిని అనుభవించినవాడిని నేను ఒక్కడినే కాదు. Malcolm Muggeridge, సమాజవాది మరియు తత్వవేత్తయైన రచయిత, వ్రాసాడు, "వెదకుటతో పాటు, నేను పురికొల్పబడ్డాను, అనే ఆలోచన నాకు ఉంది.” C.S. Lewis ఇలా జ్ఞాపకం చేసుకున్నానని చెప్పాడు, “... ప్రతి రాత్రి నేను చేయు పని నుండి నా మది ఒక క్షణం పాటైనా తొలగినయెడల, నేను ఎన్నడు కలవకూడదని ఆశించిన ఆయన నా యొద్ద వస్తున్నట్లు నాకు అనిపించేది. నేను అంగీకరించి, దేవుడు దేవుడని ఒప్పుకున్నాను, మరియు మోకరించి ప్రార్థించాను: ఆ రాత్రి, ఇగ్లాండ్ దేశమంతటిలో అత్యంత నిస్సహాయమైన మరియు నిరాకరణ కలిగిన మారుమనస్సు పొందినవానిగా నేను మిగిలిపోయాను.”
దేవునిని తెలుసుకొనిన దానికి పరిణామంగా Lewis "Surprised by Joy" అను పుస్తకమును వ్రాశాడు. దేవుని ఉనికిని అంగీకరించుట తప్ప నాకు కూడా ఎక్కువ ఆశలు లేవు. అయినను తరువాత ఆయన చూపిన గొప్ప ప్రేమను బట్టి కొన్ని నెలలు నేను ఆశ్చర్యపోయాను.
ఎందుకు యేసు? లోకములోని పెద్ద మతములన్ని చూడండి మరియు వారిలో బుద్ధుడు, మొహమ్మదు, కన్ఫుసియస్ మరియు మోషే అందరు తమను తాము బోధకులు లేక ప్రవక్తలు అని చెప్పుకున్నారు. వారిలో ఎవ్వరు కూడా దేవునితో సమానులని చెప్పుకోలేదు. ఆశ్చర్యకరంగా, యేసు చెప్పాడు. అది యేసును ఇతరుల నుండి భిన్నంగా ఉంచుతుంది. దేవుడు ఉన్నాడు మరియు మీరు ఆయనను చూస్తున్నారు అని చెప్పాడు. ఆయన పరలోకమందున్న తన తండ్రిని గూర్చి మాట్లాడినప్పటికీ, అది ఎడబాటు నుండి చెప్పలేదుగాని, మానవులందరికీ విశేషమైన ఒక సన్నిహితమైన సంబంధంగా చెప్పాడు. ఆయనను చూసిన వారు తండ్రిని చూసినట్లే అని ఆయనను నమ్మినవారు తండ్రిని నమ్మినట్లే అని యేసు చెప్పాడు.
ఆయన అన్నాడు, " యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండును."14 దేవునికి మాత్రమే చెందిన గుణాలను ఆయన దావా చేశాడు: ప్రజల యొక్క పాపములను క్షమించే శక్తి కలిగియుండుట, పాపపు స్వభావముల నుండి స్వతంత్రత, ప్రజలకు మరింత పరిపూర్ణ జీవితమును ఇచ్చుట మరియు పరలోకంలో వారికి నిత్యజీవమును ఇచ్చుట. ప్రజలను తమ మాటల వైపు ఆకర్షితులను చేసిన ఇతర బోధకులకు భిన్నంగా, యేసు ప్రజలను తన వైపు ఆకర్షించాడు. “నా మాటలను అనుసరించండి మీరు సత్యమును పొందుతారు” అని ఆయన అనలేదు. ఆయన అన్నాడు, " నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు."15
తాను దైవమని నిరూపించుటకు యేసు ఏ రుజువును ఇచ్చాడు? ప్రజలు చేయలేనివాటిని ఆయన చేశాడు. యేసు అద్భుతాలు చేశాడు. ఆయన ప్రజలను స్వస్థపరచాడు...గుడ్డివారిని, కుంటివారిని, చెవిటివారిని, మరణము నుండి కూడా ఇద్దరిని ఆయన లేపాడు. వస్తువులపై ఆయనకు అధికారం ఉంది...సన్నటి గాలిలో నుండి ఏడు వేలమందికి సరిపోవునంత ఆహారమును ఆయన సృష్టించాడు. ఆయన ప్రకృతిపై అద్భుతాలు చేశాడు...నీటిపై నడచాడు, కొందరు మిత్రుల కొరకు పెనుగాలిని ఆపాడు. యేసు ప్రజల అవసరతలు అద్భుతంగా తీర్చాడు కాబట్టి వారు ఆయనను ఎల్లప్పుడూ అనుసరించేవారు. నేను చెప్పు వాటిని మీరు నమ్మని యెడల, మీరు చూస్తున్న అద్భుత కార్యముల ఆధారంగా అయినా నన్ను నమ్మమని యేసు చెప్పాడు.16
మన స్వార్థం మరియు బలహీనతలు తెలిసికూడా మనతో అనుబంధం కలిగియుండాలని కోరుకొను ప్రేమ, ఆప్యాయత కలిగిన వానిగా యేసు క్రీస్తు దేవుని చూపించాడు. దేవుడు మనలను పాపులుగా చూస్తున్నప్పటికీ, మనం శిక్షకు పాత్రులమైనప్పటికీ, మన పట్ల ఆయనకున్న ప్రేమ వలన ఆయన వేరొక ప్రణాళికను రూపించాడని యేసు బయలుపరచాడు. దేవుడు స్వయంగా మానవ రూపం దాల్చి మన కొరకు పాపము యొక్క శిక్షను అనుభవించాడు. హాస్యాస్పదముగా ఉంది కదా? అవును, వీలైతే చాలా మంది ప్రేమించు తండ్రులు సంతోషంగా కాన్సర్ వార్డులో ఉన్న తమ పిల్లలతో స్థానములను మార్చుకోవాలని ఆశపడతారు. మనం దేవుని ప్రేమించుటకు కారణం ముందుగా ఆయన మనలను ప్రేమించుట అని బైబిల్ చెబుతుంది.
మనం క్షమించబడులాగున యేసు మన స్థానంలో మరణించాడు. మానవాళికి తెలిసిన మతములన్నిటిలో, కేవలం యేసు ద్వారానే దేవుడు మానవ జాతి యొద్దకు వచ్చాడు, మరియు ఆయనతో అనుబంధం కలిగియుండుటకు మనకు ఒక మార్గం చూపించాడు. యేసు ప్రేమ కలిగిన దైవిక హృదయాన్ని నిరూపించి, మన అవసరతలను తీర్చి, మనలను ఆయన వైపుకు లాగుతున్నాడు. యేసు మరణం మరియు పునరుత్థానం కారణంగా, ఆయన మనకు నేడు నూతన జీవితమును అందించుచున్నాడు. మనం క్షమించబడగలము, దేవుడు మనలను సంపూర్ణంగా అంగీకరించి నిజమైన ప్రేమను చూపుతాడు. “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను”17 అని ఆయన అంటున్నాడు. ఇది దేవుడు కార్యము చేయుట.
దేవుడు ఉన్నాడా? తెలుసుకోవాలనుకుంటే, యేసు క్రీస్తును దర్యాప్తు చెయ్యండి. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను”18 అని మనకు చెప్పబడింది.
ఆయనను నమ్మమని దేవుడు మనలను బలవంతం చేయడు. బదులుగా, ఆయన ఉనికిని గూర్చి మనకు కావలసినంత రుజువు ఆయన ఇచ్చాడు మరియు మనం ఇష్టపూర్వకంగా స్పందించాలని ఆయన కోరుతున్నాడు. సూర్యుని నుండి భూమి యొక్క సంపూర్ణ దూరం, నీటిలోని విశేషమైన రసాయన విలువలు, మానవ మెదడు, DNA, దేవుని తెలుసుకున్నామని చెప్పు ప్రజల యొక్క సంఖ్య, దేవుడు ఉన్నాడా అని తెలుసుకొనుటకు మన మదిలో మరియు హృదయంలో ఉండే కోరిక, యేసు క్రీస్తు ద్వారా తెలియబడాలనే దేవుని యొక్క కోరిక. యేసును గూర్చి మరింత తెలుసుకోవాలనుకున్న యెడల మరియు ఆయనను నమ్ముటకు కారణాలు కావాలంటే, చూడండి: గ్రుడ్డి నమ్మకాన్ని మించినది.
ఇది మీ నిర్ణయం, ఎలాంటి బలవంతం లేదు. మీరు దేవుని ద్వారా క్షమించబడి ఆయనతో అనుబంధం కలిగియుండాలనుకుంటే, ఆయనను క్షమించమని మీ జీవితములోనికి అడుగుట ద్వారా మీరు అలా చేయవచ్చు. యేసు అన్నాడు, " ఇదిగో నేను తలుపునొద్ద [మీ హృదయము యొక్క] నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు [ఆమె యొద్దకు] వచ్చెదను."19 మీరు ఇలా చేయలని ఆశపడి, దానిని మాటలలో ఎలా చెప్పాలో తెలియనియెడల, ఇది మీకు సహాయం చేయవచ్చు: “యేసు, నా పాపముల కొరకు మరణించినందుకు వందనాలు. నా జీవితం మీకు తెలుసు మరియు నాకు క్షమాపణ కావాలని కూడా తెలుసు. నన్ను ఈ క్షణమే క్షమించి నా జీవితములోనికి రమ్మని అడుగుతున్నాను. నిన్ను సరైన విధంగా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితములోనికి రండి. నాతో అనుబంధం కోరుకున్నందుకు వందనాలు. ఆమెన్.”
ఆయనతో మీ అనుబంధమును దేవుడు శాశ్వతమైనదిగా భావిస్తున్నాడు. ఆయనను నమ్మువారందరిని సంబోధిస్తూ, యేసు క్రీస్తు మన గురించి ఇలా అన్నాడు, " నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు."20
ఈ వాస్తవాలన్ని చూసిన తరువాత, ప్రేమించు దేవుడు ఉన్నాడని మరియు వ్యక్తిగతంగా సన్నిహితంగా ఆయనను తెలుసుకొనవచ్చని రుజువవుతుంది.
► | యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......) |
► | ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి |
► | నాకు ఒక ప్రశ్నఉన్నది,,, |
రచయితను గూర్చి: ఒకప్పుడు నాస్తికునిగా, Marilyn Adamson తరచుగా జవాబులు ఇవ్వబడిన ప్రార్థనలను మరియు ఒక సన్నిహిత స్నేహితురాలి యొక్క జీవన శైలిని తిరస్కరించుట కష్టమైయింది. తన స్నేహితురాలి యొక్క నమ్మకాలను సవాల్ చేస్తూ, దేవుని ఉనికి కొరకు ఉన్న గొప్ప విలువైన రుజువులను చూసి Marilyn ఆశ్చర్యపడింది. ఒక సంవత్సరం పాటు తరచుగా ప్రశ్నించిన తరువాత, తన జీవితములోనికి వస్తానని దేవుని పిలుపుకు స్పందించి, ఆయన యందు విశ్వాసం గొప్ప మేలులు కలిగిస్తుందని దానికి తగినన్ని రుజువులు ఉన్నాయని చెబుతూ స్పందించింది.
(1) రోమా. 1:19-21 (2) యిర్మీయా. 29:13-14 (3) R.E.D. Clark, Creation (London: Tyndale Press, 1946), p. 20 (4) The Wonders of God's Creation, Moody Institute of Science (Chicago, IL) (5) Ibid. (6) Ibid. (7) Ibid. (8) Hugh Davson, Physiology of the Eye, 5th ed (New York: McGraw Hill, 1991) (9) Robert Jastrow; "Message from Professor Robert Jastrow"; LeaderU.com; 2002. (10) Steven Weinberg; The First Three Minutes: A Modern View of the Origin of the Universe; (Basic Books,1988); p 5. (11) Dinesh D'Souza, What's So Great about Christianity; (Regnery Publishing, Inc, 2007, chapter 11). (12) Richard Feynman, The Meaning of It All: Thoughts of a Citizen-Scientist (New York: BasicBooks, 1998), 43. (13) Francis S. Collins, director of the Human Genome Project, and author of The Language of God, (Free Press, New York, NY), 2006 (14) యోహాను 8:12 (15) యోహాను 14:6 (16) యోహాను 14:11 (17) యిర్మీయా 31:3 (18) యోహాను 3:16 (19) ప్రకటన 3:20 (20) యోహాను 10:27-29