లోకంలో ఏమి జరిగినప్పటికీ లేదా మన వ్యక్తిగత జీవితములలో ఏమైన జరిగినప్పుడు నిబ్బరం కోసం వెళ్ళగలిగిన స్థలం ఉన్నదా? జీవితంలోని పరిస్థితులు, లోకంలోని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నిరీక్షణతో భవిష్యత్తును చూడగలమా? ఈ దినాలలో మనుష్యులు దేవుని యొక్క విలువను మార్పులేనట్టుగా చూస్తున్నారు. మన చుట్టూ ఉన్న లోకం ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది, గాని దేవుడు ఎప్పుడు మారాడు. ఆయన స్థిరమైనవాడు, నమ్మదగిన వాడు. “నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నేనెరుగను. ఏలయనగా ప్రభువైన నేను మార్పు లేనివాడను.”1 ఆయన నమ్మదగిన వాడు. ఆయన “నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు.”2 దేవుడు తన ద్వారా మన మనస్సుకు నెమ్మది, హృదయానికి విశ్రాంతి కలుగజేయుట ద్వారా తన్ను తానూ బయలుపరచుకుంటాడు.
హీదర్ అను స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయ డిగ్రీ చదువుతున్న వ్యక్తి ఈ మాటల్లో చెప్పారు: “నిజ జీవితంలో దేవునితో సంబంధబాంధవ్యం కలిగియుండుట అనేద ఆశ్చర్యమైన అందమైన అలవాటు. అనుదిన దైవీకభూమండల సహవాసమును లోకము కొరకు అమ్మివేయలేము. నేను చెప్పలేనంతగా లోతుగా ప్రేమింపబడుతున్నాను. దేవుడు నన్ను బాగా ఎరుగును.”
స్టీవ్ సాయర్ అను రక్తహీనత (హీమోఫిలియాక్) గలవాడు తనకు రక్తం ఎక్కించడంలో జరిగిన తప్పిదంవాళ్ళ హెచ్.ఐ.వి. సోకిందని తెలుసుకున్నప్పుడు తన జీవితంలో స్థిరత్వం కొరకు ఎదురుచూశాడు. మొదట్లో స్టీవ్ చాలా కృంగిపోయాడు. అతడు దేవుణ్ణి నిందించాడు. తరువాత దేవుని దగ్గరకు వచ్చాడు. దాని ఫలితంగా తన జీవితంలో చివరి కొద్ది సంవత్సరాలు చాలా కాలేజ్ క్యాంపస్ లకు, (అధిక బాధతో) తనలాంటి విద్యార్ధులకు దేవుని ఏలా తెలుసుకోవాలో మరియు ఆయనను తెలుసుకొనుట ద్వారా మనము సమాధానమునుఎలా అనుభవించగలమో అని చెప్పుతూ ఉండేవాడు. దేవుడు ఇలా అన్నాడు, “నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్లుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించియున్నాను.”3
స్టీవ్ లాగానే ఇతరులు చాలామంది నేర్చుకున్నదేమిటంటే ఈ జీవితంలో ఏమి జరిగినప్పటికీ అదే లోకము యొక్క అంతంకాదు.” ఎందుకంటే ఈ లోకమే అంతంకాదు.
అంగీకరించవలసిన విషయం ఏమనగా, చాలామంది పరిస్థితులు చాలా కష్టంగా వచ్చేంతవరకు దేవుని దగ్గర రావటానికి వేచియుంటారు. రెండవ ప్రపంచ యుద్ధంలోని ఒక మిలటిరి పాస్టర్ ఇలా వివరించినాడు. “యుద్ధభూమిలోని గోతులలో నాస్తికులు (దేవుడు ఉన్నాడని నమ్మనివారు) ఎవరులేరు. జీవితం సుఖంగా ఉన్నప్పుడు ఎవరూ దేవుని యొక్క అవసరతను గుర్తించరు. కాని తరచూ అది మారుతూ ఉంటుంది, సంగతులు గందరగోళంగా ఉన్నప్పుడు లేదా యుద్ధభూమిలోని గోతుల్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు కావాలనుకుంటారు. క్సెరీన్ అను యువతి దేవుని దగ్గరకు తానూ ఏలా వచ్చిందో ఇలా చెప్పుతుంది. నేను ఆదివారం చర్చీకి వెళ్ళేదానిని గనుక నేను క్రైస్తవురాలనని అనుకునే దాన్ని, కాని దేవుడంటే ఎవరో నాకు అవగాహన లేదు. స్కూల్ లోని నాలుగా సంవత్సరం కూడా మొదటి మూడు సంవత్సరాలలాగానే ఉన్నాయి. నా సమయాన్ని నేను ఎక్కువగా త్రాగటానికి మరియు నన్ను ప్రేమించేవారి కోసం ఎదురుచూచుటలోను గడిపేదాన్ని నేను లోలోపల తీవ్రమైన బాధలోను నా జీవితం మీద నియంత్రణ లేకుండా ఉండేదాన్ని.
ఆ సమయంలో నేను ఎంతగానో నా జీవితాన్ని అంతమొందించుకోవాలను కున్నానో గుర్తించాను. నేను కాలేజీకి వెళ్ళిన తరువాత నేను నిరీక్షణ కోసం ఎదురుచూచాను. ఆ సమయంలో నేను దేవుణ్ణి నా జీవితంలోకి రమ్మని అడిగాను. ఆయన నాకు ప్రేమను, కాపుదలను, క్షమాపణను, ఆధారమును, ఆదరణను, అంగీకారమును మరియు జీవితం యొక్క ఉద్దేశ్యమును ఆయన చూపించినాడు. ఆయనే నా బలము. ఈ జీవితం ఆయన కొరకు కాకపొతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేదానిని కాదు.
భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో ఎవరికీ తెలుసు? చాలామంది వారు యుద్ధగోతిలో ఉన్నరనుకుంటారు. జీవితం అనేది ఒక యుద్ధంలాంటిది. మన మనశ్శాంతి బాగా కవలింపబడవచ్చు. ఆ సమయాల్లో బాధ ఎక్కువైనప్పుడు దేవుని యొద్దకు వస్తాం. అయినా పర్వాలేదు. ఎందుకంటే మార్పులేని దేవుడు మన జీవితాలలో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, “నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేదు.”4
అవును దేవుణ్ణి “చంకక్రింద కర్ర”లాగా అనుకోవచ్చు కాని, ఆయన మాత్రమే నిజంగా న్యాయమైన వ్యక్తి.
ఏదియేమైన కొంతమందైతే అని సరిగా ఉన్నప్పుడు కూడా దేవుని వెంబడిస్తారు. యోహాననే వ్యక్తి ఇలా వివరిస్తున్నారు. నేను ఆఖరి సంవత్సరం వచ్చేసరికి ఏది సంతృప్తి ఇస్తుందని ప్రజలు చెప్పారో అది నేను సాధించాను. నేను క్యాంపస్ సంస్థల్లో నాయకత్వపు పాత్రలు పోషించినాను, చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నాను, అమ్మాయిలతో కలిసియుండటం నన్ను ఆకర్షించేది. నేను కాలేజిలో ఉండగా నేను చేయాలుకున్నది సాధించాలనుకున్నది ప్రతీది జరిగినవి కాని నేను అసంతృప్తిగానే ఉన్నాను. ఇంకా ఏదో కొదువైనట్టు ఉన్నది నేను ఎక్కడికెల్లాలో తెలియదు. పైగా నేను జీవితం విషయంలో ఇలా బాధపడుతున్నట్లు ఎవరికీ తెలియదు – బయటకు నేను అలా చూపించుకోలేదు.” జీవితంలో అన్ని చక్కగా సాగుతున్నట్లు కనబడుతున్నప్పటికి యుద్ధగోతులు అనేవి ఇంకా ఉన్నవి. ఇవి అంతరింగకమైనకళ్ళకు కనబడనవి గాని హృదయంలో అనుభవించేవి. ఈ స్థితిని బెక్కి అనే యువతి ఇలా వివరించినది. “ఎన్నిసార్లు నీవు ఆ రకమైన బట్టలు ఉంటే బాగుండేది, ఆ వ్యక్తి ప్రేమికుడిగా ఉంటే బాగుండేది, ఆ స్థలానికి వెళ్తే బాగుండేది అప్పుడు జీవితం అనేది సంతోషంగా ఉంటుంది అని నీ వినుకున్నావు? మరియు ఎన్ని సార్లు ఆ బట్టలు కొన్నాక, ఆ ప్రేమికుడితో ఉన్నప్పుడు లేదా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు తిరిగి మరలా జీవితంలో వెలితిగా మొదట్లో ఉన్నట్లే మరలా అనిపించేది?
ఆశ్రయాల కోసం వెళ్ళటానికి జీవితంలో వైఫల్యాలు లేదా దుర్ఘటనలు చోటు చేసుకోవాలనిలేదు. ఎక్కువగా, శాంతి లేకపోవడానికి కారణం దేవుడు మన జీవితాలలో లేకపోవడమే. బెక్కీ దేవుని తెలుసుకున్న అనుభవం ఇలా చెప్పుతుంది: “దేవుని తెలుసుకున్న దగ్గర నుండి నేను చాలా ఇబ్బందులకు, మార్పులకు నా జీవితంలో గురైనాను, కాని నాకు ప్రేమగల, నిత్య దేవుడు నా ప్రక్షాళన ఉన్నాడు అని గ్రహిస్తున్నప్పుడు నేను చేసే ప్రతీది ఒక నూతనమైన ఉద్దేశం కలిగియుంటుంది. నేను దేవుడు కలిసి చేయలేనిది యేది లేదని నన్ను నమ్ముతున్నాను. ఆ పరిపూర్ణత కొరకు నేను చాలా కష్టపడి వెదకాను. తుదకు దేవుని యొద్ద నాకు దొరికినది.”
దేవుడు మన జీవితములో ఉన్నట్లయితే మనము సమాధానము కలిగియుండవచ్చు. మనము దేవుని తెలుసుకొనుచు ఆయన వాక్యములో ఏమి చెప్తున్నాడో గ్రహించినట్లయితే ఆయన మన జీవితాలలో మనశ్శాంతి ఇస్తాడు. ఎందుకనగా మనము ఆయనను ఎరిగియున్నాము. ఆయన యొక్క విశ్వాస్వతను మరియు ఆయన కాపుదలను గ్రహించిన వారమై మన జీవితమును ఆయన కోణంలో నుండి చూస్తాము. కాబట్టి భవిష్యత్తు ఎలాగున్నప్పటికిని మన ఆశ్రయముగా దేవుని యందు మన నిరీక్షణ ఉండవచ్చు. మనము ఆయన వైపు తిరిగి ఆయనను వెదికిన యెడల ఆయన మన జీవితాలలో తన్నుతాను నిరూపించుకొనుటకు వేచియున్నాడు.
నీ జీవితంలో నీవు ఏదైనా నిర్మించుచున్నావా/ మీరు నమ్మండి నమ్మకపోండి ప్రతి వ్యక్తి ఏదో ఒక దాని మీద కట్టబడుతున్నాడు. మనలో ప్రతి ఒక్కరికి ఒక పునాది ఉన్నది, దాని మీద మన నిరీక్షణ విశ్వాసముంచుతున్నాము. కొన్నిసార్లు మన మీదే అయిఉండవచ్చు – “నేను బాగా కష్టపడినట్లయితే నా జీవితాన్ని నేను సఫలీకృతం చేసుకోగలనని నాకు తెలుసు” అని అనుకుంటాం. లేదా జీవనశైలి మీద కడతాం. “నేను డబ్బు బాగా సంపాదిస్తే, జీవితం బాగుంటుంది” అని అనుకుంటాం లేదా సమయం మీద కడతాం – భవిష్యత్తులో అన్ని మారిపోబోతున్నవని అనుకుంటాం.
దేవునికి వేరే దృక్పథం ఉన్నది. మన నిరీక్షణ మన విశ్వాసము మనమందు (ఉంచినట్లయితే) ఇతర మనుష్యుల యందు లేదా లోకమిచ్చే దేనియందైనా మనము ఉంచినట్లయితే అది అస్థిరమైన స్థలం అని ఆయన చెప్పుతున్నాడు. దానికి బదులుగా ఆయన తన యందు నమ్మికయుంచాలని కోరుచున్నాడు. యేసు ఇలా అన్నాడు: “కాబట్టి యీ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటి మీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ న మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.”5
మన జీవితాలలో దుర్దశలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆహ్వానించుట చాలా తెలివైన పని. కాని దేవుని ఉద్దేశ్యమేమనగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము సమృద్ధిగల జీవంతో ఉండాలి. ఆయన మన జీవితాలలో ప్రతి విషయంలో అనుకూలమైన ప్రభావం కలిగియుండాలనుకుంటున్నాడు. మనము ఆయన మీద ఆయన మాటల మీద ఆధారపడినప్పుడు మనము బండ మీద నిర్మించుచున్నాము.
కొందరుకోటీశ్వరులు బిడ్డలుగా ఉన్నందువాళ్ళ భద్రంగా ఉన్నామనుకుంటారు. మరికొందరు మంచి మార్కులు తెచ్చుకోవడంబట్టి నిర్భయంగా ఉంటారు. కాని దేవునితో బాంధవ్యం కలిగియుండుటనుబట్టి ఇంకా గొప్ప భద్రత కలిగియుంటాము.
దేవుడు శక్తిమంతుడు. ఆయన మనవలె కాదు దేవునికి ఏమి జరుగబోతుందో, వచ్చే వరం, వచ్చే సంవత్సరం, వచ్చే దశాబ్దం ఏమి జరుగబోతుందో ఆయనకు తెలుసు. ఆయన చెప్తున్నాడు, “దేవుడను నేనే మరి ఏ దేవుడును లేదు. ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను.”6 భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో ఆయనకు తెలుసు. ఇంకా ముఖ్యమైనదేదనగా ఆయనకు మీ జీవితంలో ఏమి చోటు చేసుకుంటుందో ఆయనకు తెలుసు. ఆయనను నీ జీవితమూ ఉండులాగు నీవు నిర్ణయించినట్లయితే అవి జరిగేటప్పుడు ఆయన నీతో ఉంటాడు. ఆయన మనకు “ఆశ్రయముగాను దుర్గముగాను ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా”7 ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. కాని మనము యదార్ధముగా ఆయనను వెదకాలి. “మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు.”8
దాని అర్ధం దేవునిని తెలుసుకున్నవారు కష్టాల గుండా వెళ్ళరని కాదు. వారు వెళ్తారు. మన దేశం ఉగ్రవాదుల చర్యలనుఎదుర్కుంటే, పర్యావరణ మరియు ఆర్ధిక విపత్తులకు గురైతే, దేవుని తెలుసుకున్నవారు కూడా శ్రమలలో ఉంటారు. కానీ వారితో దేవుని సన్నిధి ఇచ్చు శాంతి మరియు బలం వారికుంటుంది. యేసుక్రీస్తు అనుచరుడు ఈ విధంగా అన్నాడు, “ఎటుబోయినను శ్రమపడుచున్నాను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారముకాము, తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.”9 వాస్తవం ఏమిటంటే మనము ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొంటాం. అయితే మనము దేవునితో సహవాసము కలిగి ఉంటూ వాటిగుండా వెళ్ళినప్పుడు ఒక విభిన్నమైన రీతిలో వాటిని ఎదుర్కొంటూ మన సొంత శక్తితో ఉంటాము. ఏ సమస్యయు దేవుడు జయించలేనంత అధిగమించలేనంత శక్తిగలది కాదు. మనకు వచ్చు సమస్యలన్నిటి కంటే చాలా గొప్పాయన మనకున్నాడు గనుక వాటిని ఎదుర్కొనుటకు మనమొక్కరమే కాదు ఉన్నది.
దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తాడు. దేవుడు మన జీవితములలో చూపించగల ఆయన గొప్ప శక్తి ఆయన లోతైన ప్రేమతో వచ్చును. భవిష్యత్తులో మునుపెన్నడూ లేనంతగా ప్రపంచములో సమాధానముండవచ్చు లేదా జాతుల మధ్య ద్వేషము, హింస వివాహాలు విచ్చిన్నమౌవడం ఇంకా అనేకమైనవి జరగవచ్చు. ఏ పరిస్థితులలోనైన దేవుడు మనలను ప్రేమించినట్లు ఎవరు ప్రేమించరు. దేవుని వాక్యము ఇలా చెప్తుంది, “యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.”10 “ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి.”11 మరియు“యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టువారి కందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నేరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును.”12
యేసు క్రీస్తు తన అనుచరులకు ఈ ఆదరణ కరమైన మాటలను చెప్పినాడు. “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడవు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకలకంటే శ్రేష్ఠులు.”13 నీవు దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన మరెవరు శ్రద్ధవహించనంతగా నీ పట్ల శ్రద్ధకలిగి ఉంటాడు మరియ మరెవరు చేయని విధంగా ఆయన చేయగలడు.
భవిష్యత్తులో ఏమి జరగబోతుందో మనకు తెలియదు. ఒకవేళ అది కష్టసమయాలు తెచ్చినట్లయితే దేవుడు మనకొరకు ఉంటాడు. లేదా మంచి సమయాలు తెచ్చినట్లయితే అప్పుడునూ మనకు దేవుడు మనలో ఉన్న శూన్యాన్ని పూడ్చటానికి మన జీవితాలలో ఒక అర్థం ఇవ్వడానికి ఆయన కావాలి. అంతా చెప్పినట్లు జరిగితే ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది?
మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయమేదనగా మనము దేవుని నుండి వేరుపరచబడలేదు. మనకు దేవుడు తెలుసా? దేవునికి మనము తెలుసా? ఆయనను మనము బయట ఉంచి తెలుపులేశామా? లేదా ఆయనను లోనికి ఆహ్వానించామా/ ఆయనను తెలుసుకొనుట ద్వారా, ఆయన మనలో మార్పు చెందే ఉద్దేశాలను కలుగజేసి మనకు నిరీక్షణ ఇస్తాడు. ఆయనతో సంబంధ బాంధవ్యo కలిగియుండుటను బట్టి ఎలాంటి పరిస్థితులలోనైన మనము సమాధానము కలిగి యుండగలము.
దేవుడు మన జీవితములలో ఎందుకు కేంద్రబిందువుగా ఉండాలి? ఎందుకంటే ఆయనను తెలుసుకొనక పొతే నిజమైన శాంతి లేదా నిరీక్షణ లేదు. ఆయన దేవుడు మనము కాదు. ఆయన మనమీద ఆధారపడడు, కాని మనము ఆయన మీద ఆధారపడాలి. మన జీవితాలలో ఆయన సన్నిధి యొక్క అవసరత ఉండులాగు ఆయన మనలను సృష్టించెను. ఆయన లేకుండ జీవితం జీవించాలని మనము ప్రయత్నించవచ్చు కాని అది వ్యర్ధం.
మనము దేవునిని వేదకాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము అయాను తెలుసుకోవాలని మరియు మన జీవితములలో ఆయనను నిమగ్నం చేయాలని ఆయన కోరుచున్నాడు. కాని సమస్య ఏమిటంటే మనము ఆయనను బయట ఉంచాం. ఈ విషయాన్ని బైబిల్ ఈ రీతిగా చెప్పుతుంది, “మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తన కిష్టమైన త్రోవకు తొలిగెను.”14 మనమందరమును దేవుడు లేకుండా మన జీవితాలను జీవించాలని ప్రయత్నిస్తున్నాము. దానినే బైబిల్ “పాపము” అని పిలుచుచున్నది.
హిదర్ గూర్చి పాపమును గూర్చి ఇలా చెప్పుచున్నాడు: “నేను స్టేన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళినప్పుడు క్రైస్తవురాలను కాదు. ఉత్తేజపరచుటకు లోకము నాకాళ్ళ ముందు వేచియుంది. నేను రాజకీయ సభలకు హాజరైయ్యాను, జాతుల గూర్చి సామాజిక అవినీతి విషయములను గూర్చి పాఠాలు చెప్పాను, నాకుగా నేను సమాజ సేవా కేంద్రం పనులలో మునిగిపోయాను. లోకములో గొప్ప మార్పును తెచ్చుటకు నాలో శక్తి ఉన్నది నేను నమ్మేదానిని. పేదలైన చిన్నపిల్లలకు చదువు చెప్పేదానిని. కొన్ని క్యాంపులు నిర్వహించేదాన్ని; ఆకలిగొన్న వారికి ఇవ్వడానికి మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించేదాన్ని. అయితే నేను ఈ లోకములో ఎంత ఎక్కువగా మార్పు తెవాలనుకున్నానో అంతగా వత్తిడీకే గురైయేదానను. నేను ఉన్నత పరిపాలనను బ్యూరోక్రసీ, ద్వేషాన్ని మరియు పాపాన్ని ఎదుర్కొన్నాను. అప్పుడు నేను మానవ స్వభావమే మార్పు చెందవలసిన అవసరం ఉందని ఆలోచించడం మొదలు పెట్టాను.
మారుతున్న కాలాలు మరియు అభివృద్ధి చెందిన విజ్ఞానం గొప్ప ప్రణాళికలతో పోల్చితే అవి అంట ముఖ్యమైనవి కావు. ఎందుకు? ఎందుకంటే మనుషులముగా మన యొక్క ముఖ్యమైన సమస్య ఏమిటంటే మనకు మనమే దేవుని నుండి వేరుపరచుకున్నాము. మన సమస్యలలో గొప్ప సమస్య భౌతికమైనది కాదు గాని ఆత్మీయమైనది. దేవునికి ఇది తెలుసు కుక మన ఎడబాటుకు ఒక పరిష్కారము ఏర్పాటు చేసినాడు. యేసుక్రీస్తు ద్వారా మరలా ఆయన యొద్దకు వచ్చుట ఒక మార్గాన్ని ఏర్పరచినాడు. బైబిల్ చెప్పుచున్నది “దేవుడు లోకమును ఏంటో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”15 యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మనస్థానంలో సిలువ వేయబడినాడు (ప్రాచీన కాలములో శిక్ష విధించు పధ్ధతి). ఆయన చనిపోయి, సమాధి చేయబడి, మూడవ దినమున తిరిగి లేచాడు. ఆయన యొక్క త్యాగ పూరితమైన మరణమును బట్టి మనము దేవునితో సంబంధము కలిగి యుండగలము. “తన్నుఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవునిపిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.”16
ఇది చాలా సులువు. దేవుడు మనతో పరిపూర్ణమైన సంబంధం కలిగియుండాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ సంబంధమును క్రీస్తు ద్వారా సాధ్యపరచాడు. తరువాత దేవుని వెదకటం, ఆయనను మన జీవితాలలోనికి ఆహ్వానించడం అన్నది మన ఇష్టం. ప్రార్థన అనగా దేవునితో యదార్ధంగా మాట్లాడుత, నీవు ఇప్పుడే దేవుని యొద్దకు వెళ్లి ఆయనతో యదార్ధంగా ఇలా చెప్పవచ్చు. దేవా నేను నిన్ను తెలుసుకోవాలనుకొనుచున్నాను. నేను ఇప్పటివరకు నా జీవితంలో నిన్ను అంగీకరించలేదు, కాని ఇప్పుడు మార్పు చెందాలనుకొనుచున్నాను. నీ నుండి వేరుపరచబడినదానికి నీవు ఏర్పాటుచేసిన పరిష్కారాన్ని నమ్ముతున్నాను. నాకు పాపక్షమాపణ కలుగునట్లు మరియు నీతో సమాధాన పడునట్లు నా తరుపున చనిపోయిన యేసు క్రీస్తు నందు ఆధారపడుతున్నాను. ఈ దినం నుండి నా జీవితంలోకి నీవు రావాలని క్రియచేయాలని కోరుకొనుచున్నాను.” ఆమెన్.
నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి నీ జీవితంలోకి ఆహ్వానించావా? అది నీకును, ఆయనకు మాత్రమే తెలుసు. నీవు అలా చేసినట్లయితే నీవు ముందుకు చూడాల్సినవి చాలా ఉన్నవి. ఆయనతో సంబంధం కలిగియుండుటను బట్టి ఆయన నీ ప్రస్తుత జీవితంను సంతృప్తిగా చేయుటకు ఆయన వాగ్ధానము చేయుచున్నాడు.”17 ఆయన నీలో తన నివాసము కలిగియుండుటకు వాగ్ధానమిచ్చుచున్నాడు.18 మరియు ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు.19
మెల్లీసా అను యువతి దేవుని గూర్చి ఇలా చెప్పుతుంది. “నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు విడిపోయారు. ఏమి జరుగుచున్నదో నాకు తెలియదు. మా నాన్న ఇంటికి ఎన్నడును తిరిగి రాలేడనే తెలుసు. ఒక దినాన నేను మా నానమ్మ దగ్గరకు వెళ్లి మా నాన్న బాధపరచి ఎందుకు వెళ్ళిపోయాడు అన్నది నాకు అర్ధమౌవ్వుటలేదు అన్నాను. ఆమె నన్ను కౌగలించుకొని నిన్ను ఎప్పుడు విడువని వారు ఇంకొకరు ఉన్నారని చెప్పింది. ఆ ఇంకొకరు యేసయ్య. ఆమె హెబ్రీ 13:5 మరియు కీర్తనలు 68:5 నుండి ఈ వచనాలు చెప్పినది. “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎదబాయను మరియు “ఆయన తండ్రి లేని వారికి తండ్రి.” దేవుడే నాకు తండ్రిగా ఉన్నడను మాట వినుటకు నేనెంతో సంతోషించాను.”
నీ చుట్టూ ఉన్న లోకంలో ఏమి జరిగినప్పటికీ, దేవుడు మీ కొరకు ఉన్నాడని తెలుసుకొనుట ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. భవిష్యత్తు మీ కొరకు ఏమి దాచియుంచినా, దేవుడు స్థిరమని మీరు నమ్మవచ్చు.
► | యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......) |
► | ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి |
► | నాకు ఒక ప్రశ్నఉన్నది,,, |
(1) బైబిల్ లో యెషయా 44:8 మరియు మలకీ 3:6 (2) హెబ్రీ 13:8 (3) యోహాను 14:27 మరియు 16:33 (4) యెషయా 43:11 మరియు యెషయా 45:22 (5) మత్తయి 7:24-27 (6) యెషయా 46:9-10 (7) కీర్తనలు 46:1 (8) యిర్మీయా 29:13 (9) 2 కొరింథీ. 4:8-9 (10) నహుము 1:7 (11) 1 పేతురు 5:7 (12) కీర్తనలు 145:17-19 (13) మత్తయి 10:29-31 (14) యెషయా 53:6a (15) యోహాను 3:16 (16) యోహాను 1:12 (17) యోహాను 10:10 (18) యోహాను 14:23 (19) 1 యోహాను 5:11-13