జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

ఆయన దేవుడని యేసు ఎప్పుడైనా చెప్పాడా?

యేసు ఉద్ధారములు – యేసు దేవుడా? ఈ ఆసక్తికరమైన దావాలను పరీక్షించండి...

యేసు దేవుడని ఇతరులు నిర్థారణ పొందిరి:
పౌలు: “క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపియైయున్నాడు.”1
యోహాను: “ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను.”2
పేతురు: “మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుడి.”3

కాని యేసు తన్ను గూర్చి తాను ఏమని చెప్పెను?

యేసు ఎన్నడైనా తానను తాను దేవునితో గుర్తించుకొనెనా? బైబిల్ ప్రకారం...నిశ్చయముగా! ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు క్రింద ఇవ్వబడినవి.

తాను దేవునితో సమానుడని యేసు చెప్పెను. యేసు యొక్క ఉద్ధారములు...

తాను అబ్రాహాముకు కంటె ముందే ఉన్నానని యేసు చెప్పెను
“మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులునీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”4

యేసు నన్ను చూడమని చెప్పెను, ఆయనను చూస్తే దేవుని చూసినట్లే
అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను “నాయందు విశ్వాస ముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను!”5

“యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?”6

తాను పాపములను క్షమించగలనని యేసు చెప్పెను
“...పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా! వాడు లేచి తన యింటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.”7

“అప్పుడాయన మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను. కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.”8

తాను న్యాయాధిపతినని మరియు నిత్యజీవమును ఇవ్వగలనని యేసు చెప్పెను
“తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.”9

“అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.”10

“నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.”11

“ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.”12

తాను దేవునితో సమానుడని యేసు చెప్పెను
“నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.”13

ఆయన మన జీవితమునకు మూలమని అని యేసు చెప్పెను. యేసు ఉద్ధారములు...

“నేను జీవాహారము”
యేసు వారితో ఇట్లనెను-“జీవాహారమునేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యనదు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.”14

“నేనే మార్గమును సత్యమును, జీవమునైయున్నాను”
యేసు-“నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు.”15

“నేను లోకమునకు వెలుగైయున్నాను”
యేసు-“నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.”16

“మీరు సత్యమును తెలుసుకొందురు”
“మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు, ఆప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను.”17

“జీవము, సమృద్ధియైన జీవము”
“గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.”18

“నేను వానిని ప్రేమించెందను”
“....నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని..... ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము.”19

“నేను ఎల్లప్పుడు మీతో కూడ ఉన్నాను”
“ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.”20

యేసు నిజముగా దేవుడా అని ఇప్పటికి కూడ ఆలోచించుచున్నారా? ఈ క్రింది వ్యాసములో ఇవ్వబడిన రుజువును పరిశీలించండి: గుడ్డి నమ్మకాన్ని మించినది.

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) కొలొస్సి 1:15 (2) యోహాను 1:2 (3) 1 పేతురు 3:15 (4) యోహాను 8:56-58 (5) యోహాను 12:44-46 (6) యోహాను 14:6-9 (7) మత్తయి 9:6-8 (8) యోహాను 8:23,24 (9) యోహాను 5:21-23 (10) యోహాను 11:25 (11) యోహాను 10:27,28 (12) యోహాను 6:40 (13) యోహాను 10:30-33 (14) యోహాను 6:35 (15) యోహాను 14:6 (16) యోహాను 8:12 (17) యోహాను 8:31,32 (18) యోహాను 10:10,27,28 (19) యోహాను 14:21 (20) మత్తయి 28:20

ఇతరులతో పంచుకోండ  

TOP