జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

విషపూరిత అశ్లీల చిత్రాలు, విషపూరిత రతి: అశ్లీల చిత్రాల వైపు ఒక వాస్తవిక దృష్టి

అశ్లీల చిత్రాల వ్యసనము నుంచి స్వతంత్రత పొందండి, శృంగారము యొక్క 9 అబద్ధములను మరియు దాని నుండి ఎలా ముక్తి పొందాలో చూడండి.

Gene McConnell

అశ్లీల చిత్రాలు & వ్యసనం...సందర్భానికి వెలుపల రతి

ఒక చల్లటి, నల్లటి రాత్రిలో, చలి కాగుటకు పొయ్యలో మంట కంటె ఉత్తమమైన స్థానము లేదు. అది సురక్షితం, వెచ్చనిది, ఆహ్లాదకరమైనది, మరియు శృంగారమైనది. ఇప్పుడు అదే మంటను తీసి ఇంటి మధ్యలో పెట్టండి. వెంటనే అది నాశనకరమైనదిగా మారిపోతుంది. రతి కూడ ఆ అగ్ని వంటిదే. ఎప్పటి వరకైతే దానిని సురక్షిత సమర్పణ కలిగిన వివాహ సంబంధంలో వ్యక్తపరుస్తామో అప్పటి వరకు అది అద్భుతంగా, ప్రేమ పూర్వకంగా, శృంగారంగా ఉంటుంది. అయితే అశ్లీల చిత్రాలు రతిని ఆ సందర్భము నుండి బయటకు తీసుకువెళ్తుంది.

అశ్లీల చిత్రాల వ్యసనమునకు కారణాలు ఏవి

రతిపరంగా మనం ఎవరు అనుదానిని గూర్చి ఆరోగ్యకరమైన ఆలోచన మానసిక పర్యావరణములో ఒక ప్రాముఖ్యమైన భాగము. ఒకవేళ ఈ ఆలోచనలు కలుషితమైన యెడల, మనమెవరు అనుటలోని ముఖ్యమైన భాగము మలచబడుతుంది. రతి, ప్రేమ మరియు ఆప్యాయత అన్ని ఒకటే అని అశ్లీల చిత్రాల సంస్కృతి చెబుతుంది. అశ్లీల చిత్రాలలో, ప్రజలు అనామికులతో – అనగా వారు అప్పుడే కలిసిన వ్యక్తులతో రతిలో పాల్గొంటారు. కేవలం నా సంతృప్తి మాత్రమే కావాలి. నేను దానిని పొందునంత వరకు నేను ఎవరి శరీరమును వాడుతున్నానో దానితో నిమిత్తం లేదు. రతి మీరు ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా, ఎలాంటి పరిణామాలు లేకుండా చేయవచ్చని అశ్లీల చిత్రాలు మిమ్మును ఆలోచింపజేస్తాయి.

-అశ్లీల చిత్రాల యొక్క వక్ర ఆలోచన యొక్క సమస్య ఏమిటంటే, బంధాలు రతి మీద నిర్మించబడవుగాని, సమర్పణ, శ్రద్ధ మరియు పరస్పర నమ్మకం మీద నిర్మించబడతాయి. ఆ సందర్భంలో, పోయిలో ఉన్న మంట వలె రతి అద్భుతమైనది. మిమ్మును ప్రేమించువారు మరియు అంగీకరించువారు, మీ జీవితకాలమంతటి వరకు మీకు సమర్పణ కలిగియున్నవారు, మిమ్మును మీరు సంపూర్ణంగా ఇవ్వదగినవారితో ఉండుట, అదే రతిని అద్భుతంగా చేస్తుంది.

అశ్లీల చిత్రాల నుండి స్వతంత్రత పొందుటకు: అబద్ధములను గుర్తించండి

రతిని గూర్చి సత్యమును మీరు అశ్లీల చిత్రాల ద్వారా నేర్చుకొనలేరు. అది సత్యమును నేర్పించదు. అశ్లీల చిత్రాలు నేర్పుటకు చేయబడలేదు, అమ్ముటకు. అది ఎలా సంపాదించుచున్నాము అనే ఆలోచన లేకుండా చాలా డబ్బులు సంపాదించు ఒక పెద్ద వ్యాపారం. మీరు మరలా వచ్చి మరి ఎక్కువగా కొనుటకు అనువుగా ఉండే వాటిని వారు చూపిస్తారు. కాబట్టి, అశ్లీల చిత్రాలు ప్రజలను ఆకార్షించు మరియు పట్టుకొను అబద్ధాలను మీకు చెబుతాయి. అశ్లీల చిత్రాలు అబద్ధాలపై- రతిని గూర్చి, స్త్రీలను గూర్చి, వివాహమును గూర్చి మరియు అనేక విషయములను గూర్చి అబద్ధములపై ఆధారపడియుంటాయి. వీటిలో కొన్ని అబద్ధాలను చూసి అవి మీ జీవితాలపై మరియు వైకరిపై ఎలాంటి ప్రభావం చూపగలవో చూడండి.

  • అబద్ధం #1 – స్త్రీలు మానవుల కంటే తక్కువ ప్రాణులు

    ప్లేబాయ్ మాగ్జిన్ లో స్త్రీలను “బన్నీస్” అని పిలుస్తారు, వారిని చిన్న జంతువులు వలె లేక “ప్లేమేట్స్” వలె లేక వారిని ఒక ఆట బొమ్మ వలె చూపిస్తాయి. పెంట్ హౌస్ మాగ్జిన్ వారిని “పెట్స్” అని పిలుస్తుంది. అశ్లీల చిత్రాలు చాలా సార్లు స్త్రీలను జంతువులుగా, ఆట వస్తువులుగా, లేక శరీర భాగములుగా సంబోధిస్తాయి. కొన్ని అశ్లీల చిత్రాలలో శరీరము లేక జననాంగములు మాత్రమే చూపిస్తాయి మరియు ముఖమును అసలు చూపవు. స్త్రీలో ఆలోచనలు మరియు భావనలు కలిగిన నిజమైన మానవులనే ఆలోచనను త్రోసిపుచ్చుతాయి.

  • అబద్ధం #2 – స్త్రీలు “వేట వస్తువులు”

    కొన్ని ఆట మాగ్జిన్లలో “స్విమ్ సూట్” సమస్య ఉంది. స్త్రీలు ఒక వేట వంటివారని ఇది సూచిస్తుంది. అశ్లీల చిత్రాలు రతిని ఒక ఆటగా పరిగణిస్తుంది మరియు ఆటలో, మీరు “గెలవాలి.” “జయించాలి,” మరియు “సాధించాలి.” ఈ ఆలోచన కలిగిన పురుషులు స్త్రీలను గూర్చి మాట్లాడుతూ “సాధించాలని” మాట్లాడుతుంటారు. వారు ఎన్ని “జయములు” పొందారో దాని ఆధారంగా వారి మగతనమును వారు నిర్ణయిస్తారు. నేను “అధిగమించిన” ప్రతి స్త్రీ నా అలమర్లో ఒక ట్రోఫీ మరియు నా మగ తనమునకు ఒక గుర్తింపు.

  • అబద్ధం #3 – స్త్రీలు ఆస్తి

    ఒక సన్నటి కారు మీద ఒక అందమైన అమ్మాయి పడుకొని ఉన్న చిత్రాలను మీరు చూసియుండవచ్చు. మాట్లాడని సందేశం, “ఒకటి కొనండి, మరియు మీకు రెండు లభిస్తాయి.” బహుగా అశ్లీలమైన చిత్రాలలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. అది స్త్రీలను అమ్ముడుకు ఉన్న సరుకులు వలె చూపి, వారిని తమ కస్టమర్ల కొరకు వీలైనంత బహిరంగంగా ప్రదర్శిస్తుంది. ఒక అమ్మాయిని బయటకు తీసుకువెళ్లుటకు వారు కొంత డబ్బు వెచ్చించిన యెడల, వారితో రతిలో పాల్గొనుటకు వారికి హక్కు ఉందని కొందరు యవ్వనులు ఆలోచించుట ఆశ్చర్యము కాదు. స్త్రీలను కొనవచ్చని అశ్లీల చిత్రాలు మనకు చెబుతాయి.

  • అబద్ధం #4 – ఒక స్త్రీ యొక్క విలువ ఆమె శరీరం యొక్క ఆకర్షణ మీద ఆధారపడియుంటుంది

    అశ్లీల చిత్రాలలో తక్కువ ఆకర్షణీయంగా ఉండే స్త్రీలను హేళన చేస్తారు. వారిని కుక్కలని, చాపలని, పందులని లేక అంత కంటే హీనంగా పిలుస్తారు, ఎందుకంటే వారు అశ్లీల చిత్రాలకు కావలసిన “సంపూర్ణ” స్త్రీ కోవకు చెందరు కాబట్టి. అశ్లీల చిత్రాలు స్త్రీ యొక్క మనస్సు లేక వ్యక్తిత్వమును గూర్చి ఆలోచించవు, కేవలం ఆమె శరీరమును గూర్చి మాత్రమే.

  • అబద్ధం #5 – స్త్రీలకు బలాత్కారం అంటే ఇష్టం

    “ఆమె వద్దు అని చెప్పినప్పుడు, కావాలి అని అర్థం” అనేది అశ్లీల చిత్రాల యొక్క కీలక ఆలోచన. స్త్రీలు బలాత్కారం చేయబడుట, ఆరంభంలో వారు కొంత విడిపించుకొనుటకు ప్రయత్నించినా, తరువాత వారు ఇష్టపడుతున్నారని చూపిస్తుంది. ఆహ్లాదం కొరకు స్త్రీలను గాయపరచమని వారిపై అత్యాచారం చేయమని అశ్లీల చిత్రాలు చూపిస్తాయి.

  • అబద్ధం #6 – స్త్రీలను కించపరచాలి

    అశ్లీల చిత్రాలలో చాలా సార్లు స్త్రీలకు విరోధంగా ద్వేషపూరిత సంభాషణలు ఉంటాయి. కొన్ని వందల మార్గాలలో స్త్రీలను కించపరచు సన్నివేశాలను అశ్లీల చిత్రాలు చూపిస్తాయి. ఇలాంటి ప్రవర్తన స్త్రీలకు ఏమైనా గౌరవం చూపిస్తుందా? ఏమైనా ప్రేమను? లేక అశ్లీల చిత్రాలు స్త్రీల పట్ల కేవలం ద్వేషం మరియు మోసమును చూపుతున్నాయా?

  • అబద్ధం # 7 – చిన్న పిల్లలు రతిలో పాలుపంచుకోవాలి

    అశ్లీల చిత్రాలలో ఎక్కువగా అమ్ముడుపోయేవి “పిల్లల” అశ్లీల చిత్రాలు. స్త్రీలకు పిలక జడలు వేయుట ద్వారా, చిన్న పిల్లల బూట్లు వేయుట ద్వారా, బొమ్మలను పట్టుకొనుట ద్వారా చిన్న పిల్లల వలె “సిద్ధపరుస్తారు.” ఆ చిత్రముల యొక్క సందేశం ఏమిటంటే పెద్దలు పిల్లలతో రతిలో పాల్గొనుట సామాన్య విషయం. దీని వలన అశ్లీల చిత్రములు పిల్లలను రతి రూపంలో చూచుటకు దానిని ఉపయోగించువారిని బలపరుస్తాయి.

  • అబద్ధం # 8 – అక్రమ సంబంధంలో రతి ఆహ్లాదకరమైనది

    రతిని మరింత “ఆసక్తికరముగా” చేయుటకు అక్రమ సంబంధమైన లేక భయంకరమైన విషయములు అశ్లీల చిత్రాలలో ఉపయోగించబడుతున్నాయి. రతి అసహ్యంగాను, అక్రమంగాను, లేక అపాయకరంగాను లేనియెడల దానిని మీరు ఆస్వాదించలేరని అది చెబుతుంది.

  • అబద్ధం # 9 – వ్యభిచారం ఒక ఇంద్రజాలం

    అశ్లీల చిత్రాలు వ్యభిచారమును ఆసక్తికరంగా చిత్రిస్తాయి. వాస్తవానికి, అశ్లీల చిత్రాలలో ప్రదర్శించు అమ్మాయిలు ఇంటి నుండి పారిపోయి బానిసత్వంలో చిక్కుకొనియున్న వారు. అనేకమంది లైంగికంగా వేదించబడినవారు. వారిలో అనేకమంది కొన్ని లైంగికంగా సంక్రమించు వ్యాధులు కలిగి యవ్వనంలోనే మరణిస్తారు. చాలా మంది దానిని అధిగమించుటకు మత్తు మందులు తీసుకుంటారు.

అశ్లీల చిత్రాల యొక్క ఉద్దేశములు

యవ్వన స్త్రీల యొక్క నాశనమైన జీవితాల నుండి అశ్లీల చిత్రాలు గొప్ప లాభములను పొందుకొని, వారి వస్తువులపై చాలా ధనమును మరియు సమయమును వెచ్చించు పురుషులను ఎర వేస్తుంది.

-మనం చూసే మరియు ఆలోచించే వస్తువులు మనపై ప్రభావం చూపవని మనం అనుకుంటాం. అయినను మంచి సంగీతం, మంచి చిత్రాలు, మరియు మంచి పుస్తకాలు మనపై ప్రభావం చూపాయని చెబుతుంటాం. అవి మనలను విశ్రాంతి పరచగలవు, నేర్పించగలవు, కదల్చగలవు మరియు ప్రోత్సహించగలవు. మనలను ప్రోత్సహించు వస్తువులు మనలను బలపరచునట్లే, అశ్లీల చిత్రాలు మనపై అభావార్థక ప్రభావం చూపుతాయి.

చిత్రాలు ఎల్లప్పుడు తటస్థంగా ఉండవు. అవి మనలను బలవంతం చేయగలవు. మీ భావోద్వేగ సమయంలో తమ చిత్రాలను మీ ముందుకు తీసుకొని వస్తే, అవి మీ మదిలో నాటుకుపోతాయని వ్యాపారవేత్తలకు తెలుసు. వారి ప్రకటన చూసి మీరు ఎంత ఎక్కువగా వారి వస్తువులు కొనగాలరో, ప్రకటనలు ఇచ్చే వైజ్ఞానికులకు బాగుగా తెలుసు. కొన్ని సార్లు శ్రోతలు వస్తువు యొక్క పేరు కూడా చూడరు. రేస్సే పిసెస్ వారు “ET” అనే సినిమాలో వారి క్యాండీని చూపించుటకు చాలా డబ్బు వెచ్చించారు, మరియు వారి అమ్మకాలు ఆకాశాన్ని అంటాయి. ఎందుకు? ఒక చిన్న బాలుడు గ్రహాంతర జీవి యొద్దకు ఆ క్యాండీని తీసుకొనుటకు చాచిన చెయ్యిలో ఉన్న భావనలు ఆ క్యాండీ యొక్క చిత్రములోనికి దిగిపోయాయి. ఒక వస్తువు యొక్క అరక్షణం ప్రత్యక్షత – అది ఆకర్షణకు మధ్యలో లేనప్పటికీ – ప్రజల యొక్క స్వభావంపై ప్రభావం చూపగలదు. ఒక గంటన్నర పాటు మీరు కళ్ళు ఆర్పకుండా చూసే లైంగికంగా అశ్లీలతో నిండిన సినిమా మీపై ఎంత ప్రభావం చూపగలదో ఉహించుకోండి.

అశ్లీల చిత్రాల యొక్క పరిణామాలు ఏమిటి?

అశ్లీల చిత్రాలు మీ మదిలో ఎలాంటి ఆలోచనలను కల్పిస్తున్నాయి? మీరు సరికాని విషయలను మీ మనస్సులలో నింపిన యెడల, మీ మానసిక వాతావరణం పాడైపోయి మీ జీవితములో సమస్యలను ఎదుర్కొంటారు. లైంగికంగా మనం ఎవరో తెలుసుకొనుట మన మానసిక ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ముఖ్యమైన ఆలోచన కలుషితమైనయెడల, మనం ఎవరు అనుటకు గల ముఖ్యమైన భాగం మరల్చబడుతుంది.

అశ్లీల చిత్రాల వ్యసనం: అశ్లీల చిత్రాల ఆకర్షణ

అశ్లీల చిత్రాలు చూసే ప్రతి వారు దానికి బానిసలు కారు. కొంత మంది పురుషులు, స్త్రీలు, రతి, వివాహం, మరియు పిల్లలను గుర్చిన కొన్ని విషపూరిత ఆలోచనలతో బయటకు వస్తారు. అయితే, కొంత మంది దానికి బానిసలైపోతారు. వారి వస్తువుకు మీరు బానిసలైనయెడల అశ్లీల చిత్రాల కంపెనీలు అసలు బాధపడవు. అది వారి వ్యాపారానికి మంచిది. డా.విక్టర్ క్లైన్ వ్యసనమును యోక్క ప్రగతిని పలు భాగములలో విభజించారు; వ్యసనం, పెరుగుట, భావాలను చంపుట, మరియు కార్యము చేయుట. అశ్లీల చిత్రాలకు బానిసలైనవారిలో, మరొక మెట్టు వస్తుందని నేను గమనించాను – ఆరంభ పరిచయం. ఈ మెట్లను చూద్దాం:

ఆరంభ పరిచయం

అశ్లీల చిత్రాలకు బానిసలైనవారు త్వరగా ఆరంభిస్తారు. వారు చాలా చిన్నగా ఉన్నప్పుడే దానిని చూచుట ఆరంభిస్తారు మరియు అది వారిలోనికి ప్రవేశిస్తుంది.

అశ్లీల చిత్రాల వ్యసనం

మీరు మరలా మరలా అశ్లీల చిత్రాలను చూస్తారు. అది మీ జీవితంలో అనుదిన భాగమవుతుంది. మీరు దానిలో పట్టాబడి విడిపించబడుటకు కష్టమవుతుంది.

పెరుగుట

మీరు మరింత అశ్లీల చిత్రాల కొరకు వెదుకుతారు. ఇంతకు ముందు మీకు నచ్చని చిత్రాలను మీరు చూస్తారు. అది మిమ్మును ఇప్పుడు ఆహ్లాదపరుస్తుంది.

భావనలు కోల్పోవుట

మీరు చూసే దృశ్యాలకు మీరు చలనం లేకుండా అవుతారు. అత్యంత స్పష్టమైన అశ్లీల చిత్రాలు కూడా మిమ్మును ఉత్సాహపరచవు. మీరు అదే ఆనందమును పొందుటకు ప్రయత్నిస్తారుగాని, అది మీకు దొరకదు.

లైంగికంగా కార్యము చేయుట

ఈ సమయంలో పురుషులు ఒక కీలకమైన మార్పు కలిగి వారు చూసిన దృశ్యాల ప్రకారం కార్యములు చేయుట ఆరంభిస్తారు. కొందరు పేపర్, మరియు ప్లాస్టిక్ అశ్లీల దృశ్యాల నుండి వాస్తవిక ప్రజలలోనికి మరియు నాశనకరమైన మార్గములోనికి ప్రయాణిస్తారు.

అశ్లీల చిత్రాల వ్యసనం: నేను బానిసనైయానా?

మీ జీవితములో ఈ పద్ధతులలో ఏదైనా మీరు చూసినయెడల, వెంటనే ఆపివెయ్యాలి. అశ్లీల చిత్రాలు మీ జీవితాలను శాసిస్తున్నాయా? వాటిని విడిచిపెట్టుట మీకు కష్టమవుతుందా? మీరు ఎక్కువ కావాలని మరలా మరలా వెనక్కి వెళ్తున్నారా?

అశ్లీల చిత్రాల వ్యసనం: నేను ఏమి చేయగలను?

మీరు చేయవలసిన మొదటి పని మీరు అశ్లీల చిత్రాల వ్యసనముతో సంఘర్షిస్తున్నారని ఒప్పుకొనుట. నన్ను నమ్మండి, మీరు అలా ఉంటె మీరు ఒక్కరే కాదు లేక వింతమనుషులు కారు. కొన్ని లక్షల మంది స్త్రీ పురుషులు అశ్లీల చిత్రాల వ్యసనంలో అనేక స్థాయిలలో ఉన్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదు. మిమ్మును వలలో వేయుటకు అశ్లీల చిత్రాల సంస్థలు కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించాయి. వారు సఫలమయ్యారను విషయం ఆశ్చర్యం కలిగిస్తుందా? మీలో కొంత మందికి గతంలో అనుభవించిన లైంగిక దాడులు లేక దూషణల యొక్క అనుభవం ఉండి అశ్లీల చిత్రాల వ్యసనమును ఎదుర్కొనుట కష్టంగా ఉండవచ్చు. సహాయం లేకుండా వ్యసనాలపై దాడిలో మీరు ఏమి చెయ్యలేరు.

ఈ వ్యసనమును విరుగగొట్టుటకు మీకు ఎవరో ఒకరు కావాలి. రహస్యమును అధిగమించుట చాలా ప్రాముఖ్యమైన విషయం. దానిని అధిగమించకుండా మీరు వ్యసనము నుండి తప్పించుకొనలేరు. అంటే మీరు సంఘహర్షిస్తున్నారని అందరికి తెలియవలసిన పని లేదు. వ్యసనాలతో సతమతమవుతున్నవారికి సహాయం చేసే మీరు నమ్ముకొనదగిన ఒక వ్యక్తిని ఎన్నుకోండి – సేవకుడు, యవనస్తుల గుంపు నాయకుడు లేక సహాయకుడు. మీరు నమ్మదగినవారు, వ్యసనాలను గూర్చి అవగాహన ఉన్నవారు.

అశ్లీల చిత్రాల వ్యసనము నుండి స్వతంత్రత ఉందా?

అశ్లీల చిత్రాలు మిమ్మును అబద్ధాలతో చుట్టుముడతాయి. భిన్నంగా, దేవుడు మనలను సత్యములోనికి నడిపించగలడు. “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు సశిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును.”1 యేసు ఈ మాటలు చెప్పుట వినినవారు భంగపడి ఆయనను ప్రశ్నించారు, “మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.”2 అందుకు యేసు వారితో ఇట్లనెను. పాపము చేయువాడు పాపమునకు దాసుడు, అయితే ఆయన మిమ్మును స్వతంత్రులుగా చేయును.3

పాపం మనలను కేవలం పట్టుకొనదుగాని, దేవుని నుండి మనలను దూరం చేస్తుంది. మరియు ఎవ్వరు సంపూర్ణులు కారు. దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతులు కారు. అయితే మనకు చెప్పబడినది, “మనమందరము గొర్రెలవలె త్రోవతప్పిపోతిమి అందరు తన కిష్టమైన త్రోవకు తొలిగెను”4 మనమంతా దేవుని తీర్పుకు మరియు శిక్షకు పాత్రులం. అయినను పరిశుద్ధుడు మరియు ప్రేమ కలిగిన దేవుడు, మన పాపముల కొరకు ఒక పరిష్కారం అందించాడు, తద్వారా మనం శిక్షింపబడకుండా. మన పాపముల కొరకు శిక్షకు ఆయన స్వయంగా తనపై తీసుకున్నాడు. మనం క్షమించబడుటకు దైవ కుమారుడైన యేసు క్రీస్తు మన కొరకు హింసించబడి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. మూడు దినములు తరువాత ఆయన చెప్పినట్లే యేసు మరణము నుండి తిరిగిలేచెను. మరియు ఇప్పుడు ఆయన తనతో నీకు ఒక అనుబంధాన్ని ఇస్తున్నాడు. బైబిల్ లో ఉన్నటువంటి కథనాలలో అత్యంత ఆశ్చర్యకరమైన వచనాలలో ఇది ఒకటి, “మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి మనలను సమస్త దుర్నీతి నుండి తప్పించును.”5

అతి ప్రాముఖ్యమైన అనుబంధం

ప్రేమ ఆప్యాయత కొరకు మీ వెదకులాటలో, నిజమైన ప్రేమకు అశ్లీల చిత్రాలు ఒక ఖాళీ ప్రత్యామ్నాయం మాత్రమే. మన ఆప్యాయ అవసరతలు దేవుని ద్వారానే తీర్చబడు విధంగా దేవుడు మనలను సృష్టించాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”6 అశ్లీల చిత్రాలు ప్రజల జీవితాలలోనికి తెచ్చే చీకటి మరియు నాశనమునాకు భిన్నంగా యేసు చెప్పాడు, “నేను వారికి జీవము నిచ్చుటకు, అది సమృద్ధిగా నిచ్చుటకు వచ్చియున్నాను.”7 ఆయనతో అనుబంధం ద్వారా దేవుడు మీకు తన క్షమాపణను ఇస్తున్నాడు. మిమ్మును క్షమించి మీ జీవితాలలోనికి రమ్మని ఆయనను ఆహ్వానించగోరుచున్నారా? మీరు ఆయనతో ఇప్పుడే చెప్పవచ్చు. దీనిని మాటలలో చెప్పుటకు మీకు సహాయం కావలసినయెడల, మీకు సహాయం చేయగల ప్రార్థన ఇక్కడ ఉంది:

“ప్రభువైన యేసు, నా పాపమును గూర్చి నాకు తెలుసు, మరియు నీకు కూడా తెలుసని నాకు తెలుసు. నన్ను క్షమించమని శుద్ధిచేయమని అడుగుచున్నాను. నా పాపముల కొరకు సిలువలో మరణించినందుకు వందనములు. నా జీవితములోనికి ఈ క్షణమే వచ్చి నా జీవితములో పని చేయుట ఆరంభించండి. నీ ఇష్టానుసారంగా నా జీవితమును నడిపించండి. నీ క్షమాపణ కొరకు మరియు ఈ క్షణమే నా జీవితములోనికి వచ్చినందుకు వందనములు.”

 యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......)
 ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

(1) యోహాను 8:31-32 (2) యోహాను 8:33 (3) యోహాను 8:34 (4) యెషయా 53:6 (5) 1 యోహాను 1:9 (6) యోహాను 3:16 (7) యోహాను 10:10

ఇతరులతో పంచుకోండ  

TOP