సర్వ సృష్టిని తన గొప్పతనములో మరియు సృజనాత్మక వివరణలో సృష్టించిన దేవుని మనం తెలుసుకొనవచ్చు. ఆయన తనను గూర్చి తానుగా మంకు చెబుతున్నాడు, కాని అతకంటే ఎక్కువే జరుగుతుంది. ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకొనుటకు మనలను ఆయన తనతో అనుబంధంలోనికి ఆహ్వానించుచున్నాడు. కేవలం మనం ఆయనను గూర్చి తెలుసుకొనుట మాత్రమే కాదు, ఆయనను సన్నిహితంగా తెలుసుకోవచ్చు.
“యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు
శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు,
ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.
తమ హృదయమూర్ఖత చొప్పున జరిగించుటకై
తమ పితరులు తమకు నేర్పినట్లు
బయలు దేవతలను అనుసరించుచున్నారు
గనుకనే వారి దేశము పాడైపోయెను” (యిర్మీయా 9:23,14).
ఆయనతో మాట్లాడుటకు మరియు మనలను గూర్చిన విషయాలలో ఆయనతో పాలుపంచుకొనుటకు దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. మనం ముందు ఏదోఒకటి చేయవలసిన పని లేదు. లేకపోతే మనం వేదాంతపరంగా సరైన విధంగాను లేక పరిశుద్ధముగా కూడ ఉండనవసరం లేదు. ఆయన యొద్దకు మనం మొదటిగా వెళ్లినప్పుడు ఆయన ప్రేమ మరియు అంగీకార స్వభావం మనలను ఆహ్వానిస్తుంది.
“తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు” (కీర్తనలు 145:18).
మనం కలిగియున్న ప్రతిది ఉన్న వాటితో లేక మునుపటి ఆలోచనలతో నిర్మించబడుతుంది. అయితే వస్తువులను మాట ద్వారా చేసే శక్తి దేవునికి ఉంది, కేవలం నక్షత మండలములను మరియు జీవిత విధములను మాత్రమే కాదు, నేటి సమస్యలకు పరిష్కారం కూడ.
“మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు” (కీర్తనలు 147:5).
“కొండలతట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
యెహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు” (కీర్తనలు 121:1 ,2).
మనం పాపం చేస్తాం. మనం దేవుని మార్గములకు బదులుగా మన సొంత మార్గములలో కార్యములు చేస్తాం. మరియు ఆయన వాటిని చూస్తున్నాడు మరియు యెరిగియున్నాడు. దేవుడు అట్టి పాపములను చూసి ఊరుకొనడు, కాని అట్టి పాపముల కొరకు ప్రజలకు తీర్పు తీర్చుటకు మరియు శిక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు.
అయితే, దేవుడు క్షమించువాడు మరియు ఆయనతో మనం అనుబంధం కలిగియున్న మరుక్షణం నుండి ఆయన మనలను క్షమిస్తాడు. సిలువపై మరణం ద్వారా దైవ కుమారుడైన యేసు మన పాపము కొరకు వెల చెల్లించాడు. ఆయన మరణము నుండి లేచి మనకు ఈ క్షమాపణ అందించుచున్నాడు.
“అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.
పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని.” (రోమా. 3:22, 25).
తన భావములను మరియు ఆలోచనలను మీకు తెలియజెప్పు వ్యక్తి వలె, దేవుడు తనను గూర్చి మనకు స్పష్టంగా చెబుతాడు, మరియు తేడా ఏమిటంటే ఆయన ఎల్లప్పుడు నిజాయితీగా మాట్లాడతాడు. మనను గూర్చి మరియు ఆయనను గూర్చి ఆయన మనకు చెప్పు ప్రతి విషయం నమ్మదగిన సమాచారం. మన భావనలు, ఆలోచనలు, మరియు ఊహల కంటె ఎక్కువగా, ఆయన చెప్పువాటిలో దేవుడు ఎల్లప్పుడు స్పష్టముగాను నిజాయితీగాను ఉంటాడు. ఆయన మనతో చేయు ప్రతి వాగ్దానమును మనం నమ్మవచ్చు, ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన మాటను మనం పూర్తిగా నమ్మవచ్చు.
“నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును
అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును
నీ వాక్యము నా పాదములకు దీపమును
నా త్రోవకు వెలుగునైయున్నది” (కీర్తనలు 119:130, 105).
అన్ని విషయములను గూర్చి ఎల్లప్పుడు 100% ఖచ్చితంగా ఉండాలని మీరు ఎలా అనుకుంటారు? దేవుడు అలాంటివాడే. ఆయన జ్ఞానమునకు హద్దులు లేవు. ఒక పరిస్థితి యొక్క అన్ని విషయములను ఆయన గ్రహిస్తాడు, చరిత్ర మరియు దానికి సంబంధించిన భవిష్యద్ విషయములతో సహా. సరైన కార్యమును చేయుటకు మనము ఆయనకు సలహా ఇవ్వవలసిన, లేక ప్రోత్సహించవలసిన పని లేదు. అయనను మనం నమ్మినయెడల, ఆయన ఎన్నడు తప్పు చెయ్యడు, మరియు మనలను మోసం చేయడు. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో సరైన పనిని చేయునట్లు మనం ఆయనను నమ్మవచ్చు.
“నీ కొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు.
హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు ” (కీర్తనలు 25:3).
ఆయన ఎవరో దేవుడు మనకు చెప్పునది ఇదే. ఈ క్షణమే మీరు దేవునితో అనుబంధం ఎలా ఆరంభించగలరో ఈ క్రింది విషయములు మీకు తెలియజేస్తాయి: దేవుని వ్యక్తిగతంగా
► | దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ? |
► | నాకు ఒక ప్రశ్నఉన్నది,,, |