జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

ఏదో ఒకటి

ఇది ఈ సృష్టి సృష్టించడానికి ముందు ఎప్పుడైన ఏమైన ఉందా? అను వ్యాసమునకు తరువాయి భాగం.

ఒకవేళ ఎన్నడు ఏది ఉనికిలో లేనియెడల, నేడు కూడా ఏది ఉనికిలో ఉండేది కాదు. ఇప్పుడు ఏదో ఒకటి ఉంది కాబట్టి (ఉదాహరణకు మీరు), ఎన్నడు ఏది లేకుండా ఎన్నడు లేదు. అలా ఉన్నయెడల, మీరు ఇప్పుడు ఇక్కడ ఇది చదువుతుండేవారు కాదు. ఏది కూడా నేడు ఉనికిలో ఉండేది కాదు.

కావున ఏది ఉనికిలో లేకుండా లేని సమయం ఎన్నడు లేదు. కాబట్టి, ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంది. కాని ఏంటి? మనం ఆరంభములోనికి వెళ్లినయెడల, అప్పుడు ఉనికిలో ఉన్న అది ఏమిటి? అది ఒక దాని కంటే ఎక్కువా లేక ఒకటేనా? మరియు నేడు మనం కలిగియున్న వాటి ఆధారంగా ఆలచిస్తే అది ఏమైయుంటుంది?

మొదటిగా పరిమాణం యొక్క సమస్యను చూద్దాం. మరొకసారి మన పెద్ద నల్లటి మూయబడిన గదిని గూర్చి ఆలోచన చేద్దాం. ఆ గది లోపల పది టెన్నిస్ బంతులు ఉన్నాయి అనుకోండి. మనం కాలంలో ఎంత వెనక్కి వెళ్లగలిగితే అంతగా, అప్పటి నుండి దానిలో ఇవి మాత్రమే ఉన్నాయి: టెన్నిస్ బంతులు.

తరువాత ఏమి జరుగుతుంది? మనం ఒక సంవత్సరమంతా వేచియుంటాము అనుకొందాం. గదిలో ఏముంది? అప్పటికీ, పది టెన్నిస్ బంతులే కదా? ఎందుకంటే వేరే ఏ శక్తి ఉనికిలో లేదు. మరియు పది సాధారణ టెన్నిస్ బంతులు -- ఎంత కాలం గడిచినా -- కొంత బంతులను పుట్టించలేవని మనకు తెలుసు. లేక మరి దేనిని పుట్టించలేవు.

సరే, ఆరంభంలో ఆరు టెన్నిస్ బంతులు మాత్రమే ఉన్నాయి అనుకుందాం. అది పరిస్థితిని మార్చుతుందా? లేదు, మార్చదు. సరే అయితే, పది లక్షల టెన్నిస్ బంతులు ఉంటె ఏంటి? అప్పటికి మార్పు లేదు. ఎన్ని బంతులు ఉన్నా, ఆ గదిలో ఉన్నాయి టెన్నిస్ బంతులు మాత్రమే.

కాబట్టి పరిమాణం సమస్య కాదని మనం కనుగొన్నాము. అన్నిటి యొక్క ఆరంభములోనికి మనం వెళ్తే, ఉనికిలో ఉన్న ఆ ఏదో ఒకటి యొక్క పరిమాణం ప్రాముఖ్యమైనది కాదు. అవునా?

టెన్నిస్ బంతులను తీసివెయ్యండి. ఇప్పుడు ఆ గది లోపల ఒక కోడి పిల్ల ఉంది. ఇప్పుడు ఒక సంవత్సరం ఆగండి. ఇప్పుడు గదిలో ఏమి ఉంది? ఒక కోడి మాత్రమే అవునా? కాని ఆ గదిలో ఒక కోడి పుంజు మరియు ఒక పెట్టను ఉంచితే విషయం ఏమిటి? మనం ఒక సంవత్సరం ఆగిన తరువాత, ఏమి ఉన్నాయి? మరి కొన్ని కోడి పిల్లలు!

కావున, గది లోపల మూడవ వస్తువును సృష్టించగల కనీసం రెండు వస్తువులు ఉంటే పరిమాణం ప్రాముఖ్యమే. కోడి పెట్ట + కోడి పుంజు=కోడిపిల్ల. కాని మూడవ వస్తువును సృష్టించలేని రెండు వస్తువులను గూర్చి మనం మాట్లాడుతున్నప్పుడు పరిమాణం ప్రాముఖ్యమైనది కాదు. టెన్నిస్ బంతి+ఫుట్బాల్ = ఏమి లేదు.

కాబట్టి సమస్య పరిమాణం గూర్చి కాదు గాని నాణ్యతను గూర్చినది. ఆ ఏదో ఒకటికి ఏ గుణములు ఉండాలి? అది వేరేవాటిని ఉనికిలోనికి తేగలదా?

మనం కోడిపిల్లల యొద్దకు తిరిగి వెళ్దాము, కాని మనం చాలా ఖచ్చితంగా చూద్దాం, ఎందుకంటే ఆరంభములో విషయం కూడా అలాంటిదే కాబట్టి. ఒక గదిలో కోడి పెట్ట మరియు కోడి పుంజు ఉన్నాయి. అవి శూన్యములో వ్రేలాడదీయబడి గదిలోని వేర్వేరు భాగములలో ఉన్నాయి. అవి పిల్లలను చేయగలవా?

చేయలేవు. ఎందుకు? ఎందుకంటే పనిచేయదగిన వాతావరణం లేదు. ఆ గదిలో కోడి పెట్ట మరియు కోడి పుంజు తప్ప ఏమి లేవు. శ్వాసకు మరియు ఎగురుటకు గాలి లేదు, నడచుటకు నేల లేదు, అవి జీవించుటకు జీవనాధారం లేదు. అవి తినలేవు, నడవలేవు, ఎగరలేవు లేక శ్వాస పీల్చలేవు. వాటి వాతావరణం పరిపూర్ణంగా శూన్యమైయుంది.

కాబట్టి పిల్లలు కలుగలేవు. ఒక విధమైన వాతావరణం లేకుండా కోడి పిల్లలు కలుగలేవు లేక ఉనికిలోనికి రాలేవు. ఒక వాతావరణంలో, అవి ఇతర కోడిపిల్లలను చేయగలవు. మరియు వాతావరణం ప్రభావం చూపుట వలన – వింతగా అనిపించినప్పటికీ—అవి వేరే విధమైన కోడి పిల్లలు కాగలవు. ఒక జిరాఫీ లేక ఒక వేరే జీవి కావచ్చు.

కాబట్టి ఎలాంటి వాతావరణం లేని ఒక గది మన యొద్ద ఉంది. కాబట్టి, వాతావరణం లేకుండా ఉనికిలో ఉండగలిగిన ఒకటి మనకు కావాలి. జీవించుటకు గాలి, ఆహారం లేక నీరు అవసరం లేనిది ఒకటి మనకు కావాలి. అది ఇప్పుడు భూమిపై జీవించుచున్న ప్రతిదానిని అనర్హంగా చేస్తుంది.

అయితే, నిర్జీవ వస్తువుల విషయం ఏమిటి? వాటికి వాతావరణంతో పని లేదు, వాస్తవమే. కాని, టెన్నిస్ బంతులతో మనం ఎదుర్కొన్న సమస్యనే మరలా ఎదుర్కొనుచున్నాము. నిర్జీవ వస్తువులు దేనిని సృష్టించలేవు. సరే, టెన్నిస్ బంతులకు బదులుగా మీ యొద్ద కొన్ని లక్షల కోట్ల హైడ్రోజన్ కణములు ఉన్నాయని అనుకుందాం. అప్పుడు ఏమి జరుగుతుంది? కాలక్రమంలో, ఆ వందల కోట్ల హైడ్రోజన్ కణములు మాత్రమే ఉంటాయి, ఇంకా ఏమి మిగలవు.

నిర్జీవ వస్తువులను గూర్చి మాట్లాడుచున్నప్పుడు, అవి ఉనికిలో ఉండుటకు ఏమి అవసరమో కూడా చూద్దాం. సూపర్ కొలైడర్ గురించి ఎప్పుడైనా విన్నారా? కొన్ని సంవత్సరాల క్రితం, సృష్టిని చేయుటకు పరిశోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. సూపర్ కొలైడర్ అనేది కొన్ని వేల మైళ్ళ దూరం కలిగిన భూగర్భ గుహ, కొన్ని చిన్న చిన్న ముక్కలను తాయారుచేయుట కొరకు అత్యంత వేగంగా అణువులు ప్రయాణం చేసి ఒకదానితో ఒకటి డీకొంటాయి. ఇదంతా ఒక అత్యంత సుక్ష్మమైన ఒక చిన్న ముక్కలను చేయుటకు.

ఇది మనకు ఏమి చెబుతుంది? పది బంతులను గూర్చి మన ఉదాహరణ మనం ఊహించినంత సులభమైనది కాదు. శూన్యము నుండి ఒక టెన్నిస్ బంతిని సృష్టించుటకు గొప్ప శక్తి యొక్క అవసరం ఉంది. కాని మన యొద్ద ఉన్నది శూన్యము మాత్రమే. గదిలో ఇంకా ఏమి లేదు.

కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. ఆరంభములో ఉనికిలో ఉన్న ఆ ఏదో ఒకటి మరి దేనిపైనా ఆధారపడకుండా ఉనికిలో ఉండుటకు శక్తి కలిగినదిగా ఉండాలి. అది పరిపూర్ణంగా మరియు సంపూర్ణంగా స్వయం-సహకారిగా ఉండాలి. ఎందుకంటే ఆరంభములో అది ఒకటి మాత్రమే ఒంటరిగా ఉన్నది కాబట్టి. మరియు ఉనికిలో ఉండుటకు దానికి ఒక వాతావరణంతో పని లేకుండా ఉంది.

రెండవది, ఆరంభములో ఉనికిలో ఉన్న ఆ ఏదో ఒకటికి వేరొకదానిని సృష్టించే శక్తి ఉండాలి. ఆ శక్తి లేకపోతే, ఆ ఏదో ఒకటి మాత్రమే నేడు కూడా ఉనికిలో ఉండేది. కాని వేరేది కూడా నేడు ఉనికిలో ఉంది. ఉదాహరణకు, మీరు.

మూడవది, శూన్యము నుండి వేరొకదానిని సృష్టించుటకు ఒక గొప్ప పరిమాణంలో శక్తి కావాలి. కాబట్టి, ఆ ఏదో ఒకటి యొద్ద గొప్ప శక్తి ఉండాలి. ఒక్క చిన్న ముక్కను చేయుటకు మనకు కొన్ని మైళ్ళ గుహ మరియు గొప్ప శక్తి యొక్క అవసరం ఉంటే, ఈ లోకంలో ఉన్న వాటిని చేయుటకు ఎంత శక్తి కావాలి?

మన గదిలోనికి మరలా తిరిగి వెళ్దాం. గది లోపల ఒక విశేషమైన టెన్నిస్ బంతి ఉంది అని అనుకుందాం. అది ఇతర టెన్నిస్ బంతులను సృష్టించగలదు. దానిలో అంత గొప్ప శక్తి మరియు బలం ఉంది. మరియు ఉనికిలో ఉండుటకు మరి దేని యొక్క అవసరం లేకుండా అది మాత్రమే ఉనికిలో ఉంది. ఈ ఒక్క టెన్నిస్ బంతి ఆ నిత్యమైన ఏదో ఒకటి.

టెన్నిస్ బంతి మరొక టెన్నిస్ బంతిని సృష్టిస్తుంది అని అనుకుందాం. సమయం విషయంలో ఈ రెంటిలో ఏది గొప్పది? బంతి # 1. అది నిత్యమైన ఏదో ఒకటి, అది ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. బంతి #2, బంతి #1 సృష్టించినప్పుడు ఉనికిలోనికి వచ్చింది. కాబట్టి సమయం విషయంలో ఒక బంతి పరిమితమైనది, మరొక బంతి అపరిమితమైనది.

శక్తి విషయంలో ఈ రెంటిలో ఏది గొప్పది? మరలా, బంతి#1. దానికి శూన్యము నుండి బంతి #2ని సృష్టించే శక్తి ఉంది-అంటే దానికి బంతి #2కు నాశనం చేసే శక్తి కూడా ఉంది. కాబట్టి బంతి #1కి బంతి #2 కంటే ఎక్కువ శక్తి ఉంది. వాస్తవానికి, తన ఉనికి కోసం బంతి #2 ఎల్లప్పుడూ బంతి #1పై ఆధారపడియుంటుంది.

కాని, బంతి #1 బంతి #2కు కొంత శక్తికి ఇచ్చింది అని అనుకుందాం – బంతి #1ని నాశనం చేయుటకు చాలిన శక్తి? బంతి #1కి యొక్క ఉనికి అంతమైపోతుంది కాబట్టి, బంతి #2 గొప్పదవుతుంది కదా?

దీనిలో ఒక సమస్య ఉంది. ఒకవేళ బంతి #1 బంతి #2తో కొంత శక్తిని పంచుకొంటే, ఆ శక్తి అప్పటికీ బంతి #2ది అవుతుంది. తరువాత ప్రశ్న ఏమిటంటే: బంతి #1 తన్ను తాను నాశనం చేసుకొనుటకు తన శక్తిని ఉపయోగించగలదా? లేదు. మొదటిగా, ఆ శక్తిని ఉపయోగించుటకు బంతి #1 ఉనికిలో ఉండాలి.

రెండవదిగా, బంతి #1 ఎంత బలమైనది అంటే, చేయగలిగిన ప్రతిది బంతి #1 మాత్రమే చేయగలదు. కాని బంతి #1 ఉనికి స్తంభించుట అసంభవము కాబట్టి, అది దానిని సాధించలేదు.

బంతి #1 నాశనం కాలేదు, ఎందుకంటే అసలు బంతి #1 సృష్టించబడలేదు కాబట్టి. బంతి #1 ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. అది నిత్యమైన ఏదో ఒకటి. అంటే, అదే జీవం. అది మాత్రమే జీవం, నిత్య జీవం. బంతి #1 ని నాశనం చేయుటకు దాని కంటే గొప్ప శక్తి కావాలి. కానీ బంతి #1 కంటే గొప్పది ఏది లేదు, ఎన్నడు లేదు. మరి దేని అవసరం లేకుండా అది ఉనికిలో ఉంటుంది. కాబట్టి అది ఎన్నడు బాహ్య శక్తుల ద్వారా మార్చబడలేదు. దానికి ఆరంభం లేదు కాబట్టి, దానికి అంతము కూడా లేదు. దాని ఉనికి ఆగిపోదు, ఎందుకంటే ఉనికిలో ఉండుట దాని స్వభావం. ఆ విధంగా, అది ఎనలేనిది.

మనం చూసేది ఏమిటంటే: ఆరంభములో ఉన్నది సృష్టించబడినదాని కంటే గొప్పది. ఆ ఏదో ఒకటి తనంతట తానే ఉనికిలో ఉంది. కాని వేరేది ఉనికిలో ఉండుటకు, ఆ ఏదో ఒకటిపై ఆధారపడియుండాలి. కాబట్టి, ఆ వేరే దానికి అవసరతలు ఉన్నాయి. కాబట్టి అది నిత్యమైన దాని కంటే తక్కువది, మరియు తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే నిత్యమైన దానికి వేరే దేనితో అవసరము లేదు.

ఆ ఏదో ఒకటి తన పోలికలో ఉన్న ఇతర వాటిని సృష్టించగలదు గాని, ఆ సృష్టించబడినది ఆ ఏదో ఒకటి కంటే అనేక విషయాలలో పోలిక లేకుండా ఉంటుంది. నిత్యమైనది సమయం మరియు శక్తి విషయంలో ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుంది. అందువలన, ఆ నిత్యమైనది ఖచ్చితంగా అన్ని విషయాలలో తన వలె ఉండు దానిని సృష్టించలేదు. అది మాత్రమే ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. ఇతరుల అవసరం లేకుండా అది మాత్రమే ఉనికిలో ఉండగలదు.

నిత్యమైన ఏదో ఒకటిని గూర్చి మరింత తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? అయితే చూడండి ఎవరు.

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,
ఇతరులతో పంచుకోండ  

TOP